Covid Cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 19,406 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 49 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 19,928 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదైంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశంలో 3,91,187 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Monkeypox: విశాఖలో మంకీపాక్స్ కలకలం.. అనుమానితుడి పరారీతో టెన్షన్..!
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,26,649 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,34,793 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,34,65,552 మంది కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,40,59,768కు చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 32,73,551 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205.92 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 7,97,544 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మరో 1,953 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,74,35,147 కు చేరింది. ఇప్పటివరకు వైరస్ కారణంగా 64,33,539 మంది మరణించారు. ఒక్కరోజే 9,39,950 మంది కోలుకున్నారు. జపాన్‌లో ఒక్కరోజే 2,53,392 కేసులు నమోదు కాగా.. 183 మంది మరణించారు.