Monkeypox: విశాఖలో మంకీపాక్స్ కలకలం.. అనుమానితుడి పరారీతో టెన్షన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వెలుగు చూసి ఆందోళన కలిగిస్తోన్న మంకీపాక్స్ ఇప్పుడు విశాఖ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.. గీతం యూనివర్సిటీకి చెందిన ఓ మెడికోకు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉన్నాయని చెబతున్నారు వైద్యులు.. ఇటీవలే హైదరాబాద్ నుండి 22 ఏళ్ల యువకుడు గీతం యూనివర్సిటీకి వచ్చాడు.. అయితే, అతడిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలను గుర్తించారు.. ఆ తర్వాత గీతం ఆస్పత్రిలో చికిత్స అందించారు.. అయితే, ఆంధ్ర మెడికల్ కాలేజీ నుండి నలుగురు వైద్యుల బృందం సదరు యువకుడిని పరీక్షించడానికి వెళ్లగా.. ఆ యువకుడు పరారయ్యాడు.. దీంతో అధికారులకు కొత్త టెన్షన్ మొదలైంది.. ఆ మెడికో వివరాలు సేకరించే పనిలో పడిపోయారు జిల్లా వైద్యాధికారులు.
Read Also: Astrology : ఆగస్టు 06, శనివారం దినఫలాలు
Also Read
అయితే, దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతూనే ఉన్నందున, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.. గురువారం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య నిపుణులతో ఉన్నత స్థాయి సమావేశంలో వైరస్‌ను ఎదుర్కోవటానికి అత్యవసర వైద్య సహాయం గురించి ఆలోచనలు చేసింది.. భారతదేశంలో ఇప్పటివరకు 9 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి, ఇందులో ఒకరు మరణించడం కూడా కలకలం రేపుతోంది.. కోతులలో మొదట గుర్తించబడిన ఈ వైరస్ ప్రధానంగా సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ద్వారా వ్యాపిస్తుంది. ఇది సాధారణంగా జ్వరం, దద్దుర్లు, కణుపులు మరియు చీముతో నిండిన చర్మ గాయాలతో సహా తేలికపాటి లక్షణాలను కనిపిస్తాయి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ప్రజలు రెండు నుండి నాలుగు వారాలలోపు కోలుకున్నప్పటికీ.. తీవ్రమైన కేసుల్లో పరిస్థితి మరోలా ఉంటుందని వెల్లడించింది..
తాజావార్తలు
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!