మొన్నటి వరకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదైంది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌లు విధించాయి. దీంతో గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 27,409 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
అంతేకాకుండా గడచిన 24 గంటల్లో 347 మంది కరోనాతో మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,23,127 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతంగా నమోదైంది. తాజాగా 82,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,17,60,458గా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో మొత్తం 173.42 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి.