Site icon NTV Telugu

India Corona Bulletin : భారీగా తగ్గిన కేసులు.. ఎన్నంటే..?

మొన్నటి వరకు ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదైంది. అయితే ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కోవిడ్‌ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌లు విధించాయి. దీంతో గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 34,113 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 75.18 కోట్ల పరీక్షలు నిర్వహించబడ్డాయి, గత 24 గంటల్లో 10,67,908 పరీక్షలు జరిగాయి. దేశంలో ప్రస్తుతం 4,78,882 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతం మరియు వీక్లీ పాజిటివిటీ రేటు 3.99 శాతంగా నమోదైంది. అంతేకాకుండా తాజాగా 91,930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,16,77,641 గా ఉంది. భారతదేశం యొక్క రికవరీ రేటు ఇప్పుడు 97.68 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 346 మరణాలు నమోదు కాగా మొత్తం మరణాల సంఖ్య 5,09,011కి పెరిగింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,72,95,87,490 వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి.

https://ntvtelugu.com/another-super-feature-in-whatsapp/
Exit mobile version