India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!
- భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణపై విదేశాంగ శాఖ ప్రకటన..
- అరుణాచల్‌లో ఘర్షణ వాతావరణం ఉందన్న ఐటీబీపీ డీజీ శత్రుజీత్ సింగ్ కపూర్..
- చైనా సైనికులు గతంలో అంగీకరించిన గస్తీ విధానాల నుంచి తప్పుకోవడంతోనే ఉద్రిక్తత..
- సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వానికి ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి కీలకమన్న MEA..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China Border: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్-చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి ఉద్రిక్తత కొనసాగుతోందని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ సింగ్ కపూర్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పందించింది. చైనా సైనికులు గతంలో అంగీకరించిన గస్తీ విధానాల నుంచి తప్పుకున్నప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు అప్పుడప్పుడు ఉద్రిక్తంగా మారుతున్నయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఎల్ఏసీ వెంబడి ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, అపార్థాలను, తప్పుడు అంచనాలను నివారించేందుకు ఇరు దేశాలు ఇప్పటికే ఉన్న దౌత్య, సైనిక వ్యవస్థల ద్వారా చర్చలు కనొసాగిస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైనికులతో ఘర్షణ పరిస్థితులు కొనసాగుతున్నాయన్న ఐటీబీపీ డీజీ వ్యాఖ్యలపై మరింత సమాచారం కోరగా సంబంధిత వివరాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించాలని జైస్వాల్ సూచించారు. సరిహద్దు నిర్వహణను మెరుగుపరిచేందుకు LACపై ఇరు దేశాల అవగాహనను పెంచే మార్గాలపై చర్చించేందుకు భారత్, చైనా అంగీకరించాయని తెలిపారు.
Also Read
- Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
- Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
- Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
- DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
రాజస్థాన్ అల్వార్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఐటీబీపీ డీజీ శత్రుజీత్ సింగ్ కపూర్ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సామర్థ్యాలను పెంచేందుకు అన్ని సరిహద్దు యూనిట్లలో డ్రోన్ ఫ్లాటూన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గల్వాన్ వంటి పరిస్థితులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కొత్త స్ట్రైక్ శిక్షణ కోర్సుల్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
#WATCH | Delhi | MEA Spokesperson Randhir Jaiswal says, "The situation in the India-China border areas gets disturbed from time to time when Chinese forces diverge from established patrolling patterns. Both sides continue to use existing diplomatic and military mechanisms to resolve outstanding issues and avoid misunderstanding and miscalculation along the line of actual control. The two sides have also agreed to discuss ways to improve understanding of LAC in appropriate areas for better border management. The maintenance of peace and tranquility in the border areas is essential for the overall development of bilateral relations."
— ANI (@ANI) October 23, 2026
తాజావార్తలు
-
India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!
-
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
-
Trivikram: ఈసారి రొటీన్ కథ కాదు.. వెంకీతో కలిసి సరికొత్త ప్రయోగం చేశా
-
Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?
-
Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!