Delhi: ఇండియా కూటమి నవంబర్ 1న తలపెట్టిన ర్యాలీ ప్రారంభమైంది. రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీకి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి పిలుపునిచ్చింది. ఈ భారీ ర్యాలీకి ప్రతిపక్ష నేతలతో పాటు విపక్షాలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కన్నాట్‌ప్లేస్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష నేతలంతా ఓపెన్ టాప్ జీపులో సభా స్థలికి బయలుదేరారు. మింటో రోడ్ జంక్షన్, అజ్మేర్ గేట్ మీదుగా రామ్‌లీలా మైదాన్‌కు ఈ ర్యాలీ చేరుకుంటుంది.
ఒకే వాహనంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే, టీఎంసీ నేత మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముందు కీలక నేతలంతా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే, రామ్‌లీలా మైదాన్‌తో పాటు ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 4000 మందికి పైగా పోలీసులు మోహరించారు. మరోవైపు, ఈ ర్యాలీ కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఢిల్లీ వ్యాపారులు నాలుగోసారి రాహుల్ గాంధీకి లేఖ రాశారు. 2.5 లక్షల షాపులు మూతపడ్డాయని, 80 శాతం వ్యాపారాలు బంద్ అయ్యాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) వెల్లడించింది.
#WATCH | Delhi: INDIA bloc leaders, including Rahul Gandhi, Priyanka Gandhi Vadra, Mamata Banerjee, Farooq Abdullah, Tejashwi Yadav, Akhilesh Yadav, Supriya Sule, Abhishek Banerjee, KC Venugopal and others move towards Ramlila Maidan for the INDIA bloc’s mega rally.
(Source: ANI/Congress)
— ANI (@ANI) November 1, 2026

