Site icon NTV Telugu

INDIA Bloc: ముంబై వేదికగా బలప్రదర్శనకు ఇండియా కూటమి ప్లాన్..

India Bloc

India Bloc

INDIA Bloc: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమి తన స్పీడ్ పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కూటమిలో లుకలుకలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూటమి నుంచి వైదొలిగి మళ్లీ బీజేపీతో జతకట్టాడు. మరోవైపు కాంగ్రెస్‌తో టీఎంసీ, ఆప్ పార్టీలకు మధ్య సీట్ల షేరింగ్ గురించి విభేదాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేయగా.. ఆప్ కూడా పంజాబ్, ఢిల్లీల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని చెప్పింది.

Read Also: Vande Bharat Train: “వందేభారత్ ట్రైన్” భోజనంలో బొద్దింక.. స్పందించిన రైల్వే..

ఇదిలా ఉంటే ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి బలంగానే ఉందని చెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులో ముంబై వేదికగా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ర్యాలీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, డీఎంకే, తృణమూల్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి గత ఏడాది భారత కూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కీలక నేతలు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్ సహా కీలక నేతలందరూ ఈ ర్యాలీకి హాజరవుతారో లేదో తెలియదు.

Exit mobile version