Pahalgam Terror Attack: భారత్ మరో కఠిన చర్య.. పాక్ యూట్యూబ్ ఛానళ్లు నిషేధం
- భారత్ మరో కఠిన చర్య
- పాక్ యూట్యూబ్ ఛానళ్లు నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటు పడింది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సహా పలు పాకిస్థానీయుల ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లకు సందేశం పంపించింది.
ఇది కూడా చదవండి: Odisha: 35 ఏళ్లుగా భారత్‌లోనే నివాసం.. పాక్‌లో ఎవరూ లేకపోయినా పంపేసే యత్నం. ఓ అబల ధీనగాథ
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
నిషేధించిన ఛానెల్స్‌లో డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్ వంటి ప్రముఖ పాకిస్థానీ మీడియా సంస్థలతో పాటు, మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు చెందిన ‘100mph’ ఛానెల్‌పై కూడా నిషేధం పడింది. భారతదేశం, భారత సైన్యం, భద్రతా సంస్థలపై తప్పుడు సమాచారం, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాక్‌కు చెందిన 16 యూబ్యూట్ ఛానళ్లపై నిషేధం విధించింది.
ఇది కూడా చదవండి: Shahid Afridi: పహల్గామ్ దాడిపై రక్తం మరిగే వ్యాఖ్యలు చేసిన అఫ్రిది.. మండిపడుతున్న భారతీయులు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
ఇది కూడా చదవండి: Pak-India: బోర్డర్లో ఉద్వేగ పరిస్థితి.. తల్లికి దూరమైన పసిబిడ్డలు.. కారణమిదే!
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!