Nitish Kumar: ఇండియా కూటమికి వరసగా ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఈ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కి మిత్ర పక్షాలు ఝలక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. ఎంపీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు చెప్పింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో పంజాబ్, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Ayodhya: హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు.. భర్తకు విడాకులు..
ఇదిలా ఉంటే తాజాగా ఇండియా కూటమి తొలి సమావేశానికి నాయకత్వం వహించిన బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 29న యాత్ర బీహార్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సీట్ల పంపిణీపై కాంగ్రెస్ ఆలస్యం చేస్తుండటాన్ని జేడీయూ తప్పుబడుతోంది. దీనిపై ఆగ్రహంతో ఉంది. ఒక వేళ ఇదే జరిగితే బీజేపీని ఓడించేందుకు, ప్రధాని మోడీని గద్దె దించేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి భవితవ్య ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
