Site icon NTV Telugu

Vice President Election: క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి.. లిస్ట్‌లో ఎన్ని పార్టీలున్నాయంటే..!

Vice President Election

Vice President Election

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా ఇండియా కూటమి గుర్తించింది. అనుకున్నదానికంటే జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో ప్రతిపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లుగా హస్తం పార్టీ గుర్తించింది. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. సుదర్శన్‌రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఇక 15 ఓట్లు మాత్రం చెల్లనివిగా పరిగణించబడ్డాయి. దాదాపు 152 ఓట్ల తేడాతో సుదర్శన్‌రెడ్డిని రాధాకృష్ణన్ ఓడించారు. దీంతో 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి: KP Sharma Oli: 24 గంటలుగా కనిపించని నేపాల్ మాజీ ప్రధాని ఓలి ఆచూకీ.. ఏదైనా జరిగిందా?

ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇక ఇండియా కూటమికి చెందిన 315 మంది ఎంపీలు పోలింగ్‌లో పాల్గొన్నారు. కానీ 300 ఓట్లు మాత్రమే సుదర్శన్‌రెడ్డికి పడ్డాయి. మిగతా 15 ఓట్లు చెల్లనవిగా అయిపోయాయి. దీంతో ఉద్దేశపూర్వకంగా ఇండియా కూటమి ఎంపీలు చేసినట్లుగా అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి: Nepal: మహిళా మంత్రిపై మూకుమ్మడి దాడి.. వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాలు

చెల్లని ఓట్లను గుర్తించేందుకు ప్రత్యేక సమావేశం పెట్టాలని హస్తం పార్టీ ఆలోచిస్తోంది. ఈ క్రాస్ ఓటింగ్‌లో డీఎంకే ఎంపీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణన్ తమిళనాడు వాసి కాబట్టి.. ఆయనకు వేసినట్లుగా తెలుస్తోంది. అలాగే శివసేన (యూబీటీ) ఎంపీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికే వేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకే వేసినట్లు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి ఏడు ఓట్లు క్రాసింగ్ జరిగింది. శివసేన (యూబీటీ) నుంచి మూడు, కాంగ్రెస్ నుంచి నాలుగు, ఆప్, ఆర్జేడీ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా ప్రాథమికంగా కనిపెట్టింది. త్వరలోనే కాంగ్రెస్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Exit mobile version