India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
- ఆసియా పవర్ ఇండెక్స్‌లో మూడో స్థానంలో భారత్..
- మోడీ సెకండ్ పవర్ ఫుల్ లీడర్..
- తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Modi: భారత్ ఆసియాలోనే మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. లోవీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2026 ఆసియా పవర్ ఇండెక్స్ నివేదికఈ విషయాన్ని వెల్లడించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆసియాలోనే రెండో అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిస్థానలో నిలిచారు. ఆర్ధిక వృద్ధిపై అంచనాలు, దౌత్యపరమైన ప్రభావం, రక్షణ సంబంధాలు, సాంస్కృతిక ప్రాభవం వంటి అంశాలు భారత్‌తో మూడో స్థానంలో నిలిపాయి.
చైనాతో తగ్గిన భారత్ అంతరం..
2018లో ఆసియా పవర్ ఇండెక్స్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్, చైనా మధ్య శక్తి అంతరం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ చైనా శక్తి భారత్ కన్నా 80 శాతం అధికంగా ఉందని నివేదిక పేర్కొంది. లోవీ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఎనిమిది ప్రధాన ప్రమాణాల్లో ఐదింటిలో భారత్ పురోగతి సాధించింది. మరో మూడింటిలో వెనకబడింది. దౌత్యపరమైన ప్రభావం కొంత తగ్గినప్పటికీ, అది భారత్‌కు అత్యంత బలమైన, స్థిరమైన అంశంగా కనసాగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
Also Read
- Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
- Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
- Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్‌లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్‌లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
- UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
రక్షణ రంగంలో పెరిగిన ప్రభావం..
ఆసియా దేశాలతో భారత్ పెంచుకుంటున్న రక్షణ సంబంధాలు, సాంస్కృతిక ప్రభావం దేశ ప్రతిష్టను మరింత పెంచినట్లు నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలతో రక్షణ సహకారం, బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకం భారత్‌కు ప్రయోజనం చేకూర్చినట్లు నివేదిక పేర్కొంది. ఈ పరిణామాలు రక్షణ నెట్వర్క్ విభాగంలో భారత్‌ను 9వ స్థానానికి చేర్చింది.
మోడీ నాయకత్వానికి రెండో స్థానం..
భారత్ తన ప్రభావాన్ని క్రమంగా పెంచుకుంటోందని, 40.5 పాయిట్లతో ప్రధాన శక్తిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని నివేదిక పేర్కొంది. ఆసియాలో రెండో అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా జిన్‌పింగ్ తర్వాత మోడీ నిలిచారు. ఇదే సమయంలో కొన్ని బలహీనతల్ని కూడా భారత్ ఎదుర్కొంటోంది. రూపాయి విలువ బలహీనపడటం, గల్ఫ్ ప్రాంతంలో సంఘర్షణ సమయంలో భారత్ దౌత్యపరమైన ప్రొఫైల్ తగ్గడం ప్రధాని మోడీ నాయకత్వం, వ్యూహాత్మక ఆశయాలపై అంతర్జాతీయ అభిప్రాయాలు కొంత బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
అమెరికాకు దగ్గరవుతున్న చైనా..
మరోవైపు, ఆసియా పవర్ ఇండెక్స్‌లో అమెరికా తొలిస్థానంలో కొనసాగుతోంది. అమెరికా ఆసియా దేశం కానప్పటికీ, దాని ప్రభావం ఆసియా, పసిఫిక్‌పై దాని దాని రాజకీయ, సైనిక, ఆర్థిక ప్రభావం ఉండటమే కారణం. అమెరికా ఆసియాలో తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. పవర్ విషయంలో అమెరికాకు చైనా దగ్గరవుతోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ఆ ప్రాంత వ్యవహారాల్లోనే ఎక్కువ దృష్టి పెట్టడంతో, ఆసియాపై అమెరికా చూపు కాస్త తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో అమెరికా 78.9 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా, చైనా 73.9 పాయింట్లు, భారత్ 40.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
టాప్ 10 దేశాలు వాటి స్కోర్లు..
1 అమెరికా 78.9
2 చైనా 73.6
3 భారత్ 40.5
4 జపాన్ 38.6
5 రష్యా 32.2
6 ఆస్ట్రేలియా 31.7
7 దక్షిణ కొరియా 31.0
8 సింగపూర్ 26.9
9 ఇండోనేషియా 21.7
10 మలేషియా 20.5
తాజావార్తలు
-
India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
-
Bhogi Trailer: భోగి ట్రైలర్లో కథ చెప్పేశారుగా? ఆ మర్డర్స్ వెనక కుట్ర?
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
-
IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!