Amit Shah: బీహార్‌ని “లాంతరు” యుగానికి తీసుకెళ్లాని ఇండి కూటమి భావిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా ఇండియా కూటమి, ఆర్జేడీపై ఫైర్ అయ్యారు. లాలూ-రబ్రీ ప్రభుత్వ హయాంలో బీహార్‌ని ‘జంగిల్ రాజ్’గా మార్చారని విరుచుకుపడ్డారు. బీహార్ కతిహార్‌లో ఈ రోజు జరిగిన బహిరంగ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పేద ప్రజల జీవితాల్లో పరివర్తన తీసుకువచ్చారని అన్నారు. రాజకీయాల్లో కుటుంబవాదాన్ని నిర్మూలించే పనిని ప్రధాని మోడీ చేశారని అన్నారు. ప్రధాని కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలను ధ్వంసం చేశారని చెప్పారు.
లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలు జేడీయూ, బీజేపీలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోరాడటం మీ అందరికి గుర్తుంది.. లాలూ-రబ్రీ ప్రభుత్వం బీహార్‌ని జంగిల్ రాజ్‌గా మార్చింది. ‘‘ఈ రోజు లాలూ కాంగ్రెస్ పార్టీలో కలిసి ఉన్నాడు, ఇదే కాంగ్రెస్ పార్టీ వెనకబడిన తరగతులను వ్యతిరేకించిందని, కాకా సాహెబ్ కాలేల్కర్ కమిషన్ నివేదికను అణిచివేసిందని, మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకించందని నేను లాలూకి చెప్పాలనుకుంటున్నాను.’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
Read Also: Maharashtra: 19 ఏళ్ల మనవరాలిపై పదేళ్లుగా అత్యాచారం.. చివరకు..
లాలూ పాలనలో పేదలు, వెనకబడినవారు, ఓబీసీలు అందరూ అఘాయిత్యాలకు గురయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నితీష్ కుమార్ సీఎం అయినప్పటి నుంచి ఈ దౌర్జన్యాలు ఆగిపోయాయని అమిత్ షా చెప్పారు. నితీష్ కుమార్ ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటికి విద్యుత్ అందించారు, కానీ ఇండి కూటమి మరోసారి బీహార్‌ని లాంతరు యుగానికి తీసుకెళ్లాలని, ఓబీసీలను అణిచివేయాలని భావిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, లాలూ పార్టీలు గత 70 ఏళ్లుగా ఆర్టికల్ 370ని దాటవేస్తున్నాయని, మోడీజీ 2019 ఆగస్టులో దానిని రద్దు చేశారని హోం మంత్రి అన్నారు.
మోడీజీ నక్సలిజాన్ని తుదముట్టించి తీవ్రవాదాన్ని అణిచివేశారని, కానీ యూపీఏ ప్రభుత్వంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇక్కడకు వచ్చి బాంబు పేలుళ్లు జరిపేవారని, ఉరీ, పుల్వామా దాడులు జరిగిన 10 రోజుల్లోనే మోడీజీ పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు చేయించారని, ఉగ్రవాదుల్ని అంతమొందించారని అమిత్ షా అన్నారు. తొలి ఓబీసీ ప్రధానిని చేసింది బీజేపీయేనని ఆయన చెప్పారు. టీ అమ్మే సాధారణ వ్యక్తి ప్రధాని అయ్యారు. మోడీ క్యాబినెట్లో 35 శాతం ఓబీసీలే ఉన్నారని వెల్లడించారు. 80 లక్షల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్ ఇచ్చాం. 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి, 10 కోట్లకు పైగా తల్లులకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!