NTV Telugu Site icon

Amit Shah: బీహార్‌ని “లాంతరు” యుగానికి తీసుకెళ్లాని ఇండి కూటమి భావిస్తోంది..

Amit Shah

Amit Shah

Amit Shah: బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా ఇండియా కూటమి, ఆర్జేడీపై ఫైర్ అయ్యారు. లాలూ-రబ్రీ ప్రభుత్వ హయాంలో బీహార్‌ని ‘జంగిల్ రాజ్’గా మార్చారని విరుచుకుపడ్డారు. బీహార్ కతిహార్‌లో ఈ రోజు జరిగిన బహిరంగ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పేద ప్రజల జీవితాల్లో పరివర్తన తీసుకువచ్చారని అన్నారు. రాజకీయాల్లో కుటుంబవాదాన్ని నిర్మూలించే పనిని ప్రధాని మోడీ చేశారని అన్నారు. ప్రధాని కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలను ధ్వంసం చేశారని చెప్పారు.

లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలు జేడీయూ, బీజేపీలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోరాడటం మీ అందరికి గుర్తుంది.. లాలూ-రబ్రీ ప్రభుత్వం బీహార్‌ని జంగిల్ రాజ్‌గా మార్చింది. ‘‘ఈ రోజు లాలూ కాంగ్రెస్ పార్టీలో కలిసి ఉన్నాడు, ఇదే కాంగ్రెస్ పార్టీ వెనకబడిన తరగతులను వ్యతిరేకించిందని, కాకా సాహెబ్ కాలేల్కర్ కమిషన్ నివేదికను అణిచివేసిందని, మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకించందని నేను లాలూకి చెప్పాలనుకుంటున్నాను.’’ అని అమిత్ షా అన్నారు.

Read Also: Maharashtra: 19 ఏళ్ల మనవరాలిపై పదేళ్లుగా అత్యాచారం.. చివరకు..

లాలూ పాలనలో పేదలు, వెనకబడినవారు, ఓబీసీలు అందరూ అఘాయిత్యాలకు గురయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నితీష్ కుమార్ సీఎం అయినప్పటి నుంచి ఈ దౌర్జన్యాలు ఆగిపోయాయని అమిత్ షా చెప్పారు. నితీష్ కుమార్ ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటికి విద్యుత్ అందించారు, కానీ ఇండి కూటమి మరోసారి బీహార్‌‌ని లాంతరు యుగానికి తీసుకెళ్లాలని, ఓబీసీలను అణిచివేయాలని భావిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, లాలూ పార్టీలు గత 70 ఏళ్లుగా ఆర్టికల్ 370ని దాటవేస్తున్నాయని, మోడీజీ 2019 ఆగస్టులో దానిని రద్దు చేశారని హోం మంత్రి అన్నారు.

మోడీజీ నక్సలిజాన్ని తుదముట్టించి తీవ్రవాదాన్ని అణిచివేశారని, కానీ యూపీఏ ప్రభుత్వంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇక్కడకు వచ్చి బాంబు పేలుళ్లు జరిపేవారని, ఉరీ, పుల్వామా దాడులు జరిగిన 10 రోజుల్లోనే మోడీజీ పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు చేయించారని, ఉగ్రవాదుల్ని అంతమొందించారని అమిత్ షా అన్నారు. తొలి ఓబీసీ ప్రధానిని చేసింది బీజేపీయేనని ఆయన చెప్పారు. టీ అమ్మే సాధారణ వ్యక్తి ప్రధాని అయ్యారు. మోడీ క్యాబినెట్‌లో 35 శాతం ఓబీసీలే ఉన్నారని వెల్లడించారు. 80 లక్షల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్‌ ఇచ్చాం. 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి, 10 కోట్లకు పైగా తల్లులకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని ఆయన తెలిపారు.