Site icon NTV Telugu

లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా… షెడ్యూల్ కంటే ముందే…

వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ర‌సాభాసాగా సాగుతున్నాయి.  స‌మావేశాలు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, పెగాస‌స్ అంశంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డుతూ వ‌చ్చాయి విప‌క్షాలు.  నినాదాలు, నిర‌స‌న‌ల మ‌ధ్య స‌భను నిర్వ‌హించారు.  అయితే, ఈరోజు కూడా విప‌క్షాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేయ‌డంతో లోక్‌స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు.  షెడ్యూల్ ప్ర‌కారం ఈనెల 13 వ‌ర‌కు స‌మావేశాలు జ‌ర‌గాల్సి ఉండ‌గా, షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే స‌మావేశాలను నిరవ‌ధికంగా వాయిదా వేశారు.  17 రోజుల‌పాటు లోక్‌స‌భ స‌మావేశాలు న‌డిచాయి.  కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, పెగాస‌స్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టిన విప‌క్షాలు, రాజ్యాంగ‌స‌వ‌ర‌ణ బిల్లుకు మాత్రం విప‌క్షాలు అన్ని మ‌ద్ద‌తు తెలిపాయి.   దీంతో ఈ బిల్లు స‌భ ఆమోదం పొందింది.   

Read: రష్మిక దరిదాపుల్లో కూడా ఎవరు లేరే.. ఎందుకంత క్రేజ్?

Exit mobile version