రష్మిక దరిదాపుల్లో కూడా ఎవరు లేరే.. ఎందుకంత క్రేజ్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకొంది. ‘ఛలో’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ. పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది. మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలు, వీడియోలతో బాగా సందడి చేస్తూ యువతకు క్రష్ గా మారింది.
ఇక ఈ ముద్దుగుమ్మ ఇన్‌‌‌‌స్టా‌‌‌గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్లకు చేరిన విషయం తెలిసిందే. తక్కువ సినిమాలతోనే ఈ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి. చాలా మంది సౌత్ స్టార్ హీరోయిన్లకు సాధ్యం కానీ ఈ ఘనత ఈ బ్యూటీ దక్కించుకోవటం వెనక.. అంతలా ఏం ఉందో సగటు ప్రేక్షకునికి అర్థంకావటం లేదు.
అయితే రష్మిక తన లైఫ్ స్టైల్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటం, రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలు అభిమానులతో పంచుకోవటం, వర్కౌట్స్ కోసం డైలీ జిమ్ కు వెళ్లడం.. ఆ ఫోటోలు ఇట్టే వైరల్ అవ్వడం, రెగ్యులర్ హీరోయిన్స్ కంటే రష్మిక భిన్నమైన సౌందర్యం కలిగి ఉండటం.. ఆమె ఫాలోయింగ్ కి ప్రధాన కారణంగా మరొకొందరు చెప్పుకొస్తున్నారు. ఇక తన పెట్ డాగ్ కూడా అభిమానులు ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ అమ్మడు సోషల్ మీడియా క్రేజ్ ఏంటో..! ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే 30 మిలియన్లకు చేరిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు..!

Image
-Advertisement-రష్మిక దరిదాపుల్లో కూడా ఎవరు లేరే.. ఎందుకంత క్రేజ్?

Related Articles

Latest Articles