Site icon NTV Telugu

Cold Wave: చలి గుప్పిట ఉత్తరాది రాష్ట్రాలు..

Winter

Winter

Increased cold intensity in northern states: దేశంపై చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు చలితో వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే కొద్ది రోజులు చలిగాలుల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వారం రోజులుగా చలిగాలుల ప్రభావం ఉంది. ఢిల్లీలో ఆదివారం ఉష్ణోగ్రత 5.3 డిగ్రీలకు పడిపోయింది. సాధారణం కన్నా మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.

Read Also: Afghanistan: ఆఫ్ఘన్‌లో మహిళా విద్యార్థుల నిరసన.. తరగతులు బహిష్కరించిన విద్యార్థులు

హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. డిసెంబర్ 27 వరకు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ లలో కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక కాశ్మీర్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గడ్డకట్టే స్థాయి కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. ప్రసిద్ధ దాల్ సరస్సు గడ్డకట్టింది. చలి పరిస్థితుల కారణంగా అనేక ప్రాంతాల్లో నీటి సరఫరా లైన్లు గడ్డకట్టాయి.

Exit mobile version