NTV Telugu Site icon

Congress: కాంగ్రెస్‌కి వ్యూహకర్తలు షాకిస్తున్నారా.. ప్రశాంత్ కిషోర్ తర్వాత సునీల్ కనుగోలు దూరం..?

Congress

Congress

Congress: 2024 సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగబోతోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీని గద్దె దించి కాంగ్రెస్, ఇండియా కూటమి అధికారం చేపట్టాలని గట్టిగా కోరుకుంటున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఆప్ వంటి కీలక పార్టీలు ఇండియా కూటమి పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే కాంగ్రెస్‌కి మాత్రం కష్టకాలం కనిపిస్తుంది. దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తలుగా సునీల్ కనుగోలు 2024 లోక్‌సభ ఎన్నిలక ప్రచారంలో భాగం కావడం లేదు.

Read Also: Pak Terrorist: ముంబై దాడి కుట్రదారు, లష్కరే కీలక ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవి మృతి

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుకు కీలకంగా వ్యవహరించిన సునీల్ కనుగోలు ఎన్నికల ప్రచారంలో భాగం కావడం లేదు. రెండేళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ టీం నుంచి వైదొలిగారు. అయితే కనుగోలు హర్యానా, మహారాష్ట్ర ప్రచారాలపై దృష్టి పెడుతున్నారని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు 2022లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు దూరమయ్యారు.

అయితే, కీలకమైన ఎన్నికల్లో పోల్ స్ట్రాటజిస్ట్ అందుబాటులో ఉండరనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ నాయకుడు అతని గైర్హాజరు పార్టీకి దెబ్బగా అభివర్ణించినట్లు సమాచారం. సునీల్ కనుగోలు క్యాబినెట్ హోదాతో ప్రస్తుతం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రాథమిక సలహాదారుగా ఉన్నారు. కనుగోలు వ్యూహాలతో బీజేపీ నుంచి కర్ణాటకను, బీఆర్ఎస్ నుంచి తెలంగాణను కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం ఆయన వ్యూహాలు విఫలమయ్యాయి.