NTV Telugu Site icon

Gujarat Assembly Polls Results: కాంగ్రెస్‌కు మరోదెబ్బ.. గుజరాత్‌లో ప్రతిపక్ష హోదా కూడా కష్టమే..

Congress

Congress

Gujarat Assembly Polls Results: గుజరాత్‌ అసెంబ్లీలో కేవలం 16 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగిన కాంగ్రెస్‌ పార్టీకి మరోదెబ్బ తగిలింది. గుజరాత్‌లో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో పడిపోయింది. భారత్​ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం నింపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న హస్తం పార్టీకి గుజరాత్​ ఎన్నికల రూపంలో గట్టి షాక్ తగిలింది. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టలేకపోగా బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దుస్థితికి చేరింది. 2017 ఎన్నికలతో పోల్చితే ఈసారి హస్తం గుర్తుపై గెలిచిన అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోయింది. 1995లో 149 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన కాంగ్రెస్.. అప్పటి నుంచి వరుసగా ఏడు సార్లు ఓటమిపాలైంది. 2017లో కాస్త తేరుకున్నా.. 2022లో మాత్రం బోల్తా కొట్టింది. భాజపా ధాటికి తట్టుకోలేక చతికిలపడిపోయింది. గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడిని ఎంపిక చేసేందుకు పార్టీకి కనీసం 10 శాతం బలం అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఎన్నడూ లేనంత చెత్త పనితీరు కనబరిచిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నాయకుడిని నియమించేందుకు అవసరమైన సంఖ్యాబలం కూడా లేకపోయింది.

కేంద్రంలో కూడా కాంగ్రెస్ రెండు జాతీయ ఎన్నికల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎంపిక చేయలేకపోయింది. 2014లో, మరొకటి 2019లో వరుసగా 44, 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మల్లికార్జున్ ఖర్గేను లోక్‌సభ అభ్యర్థిగా చేసేందుకు ప్రయత్నించారు. కానీ అయితే నిబంధనలను ఉటంకిస్తూ అప్పటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోవాలంటే ఒక పార్టీకి 55 సీట్లు కావాలి. ఈసారి మరో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి గుజరాత్‌లో బీజేపీ రికార్డు సృష్టించింది. ఘట్లోడియా స్థానంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విజయం సాధించారు.

Read Also:
Hardik Patel: గుజరాత్‌లో బీజేపీ భారీ విజయానికి కారణం అదే..

గుజరాత్‌లో కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని మోడీని ఢీకొట్టే నాయకుడు లేకపోవడంతో పాటు వ్యూహ చతురత కొరవడింది అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత సమస్యలు, కుమ్ములాటలు, అలకలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో పార్టీ సమస్యలు తీర్చడానికే సమయం లేదు. ఎన్నికలపై దృష్టి సారించడం కష్టంగా మారింది. ఇక క్షేత్ర స్థాయి నాయకులను.. నియోజకవర్గ స్థాయిలో ఉన్న నేతలను సరిగా ఉపయోగించుకోలేదు. పదవి దక్కని సీనియర్లు.. పదవిలో ఉన్న వారికి సహకరించలేదు. ఈ కారణంగానే పార్టీని సంస్థాగతంగా బలపరచలేక, బలంగా ఉన్న బీజేపీ కాంగ్రెస్​ ఢీకొట్టలేకపోయింది. కాంగ్రెస్​ నుంచి ఇతర పార్టీలకు వలసలతో పాటు బీజేపీపై వ్యతిరేకతను ఆ పార్టీ నేతలు వాడుకోలేకపోయినట్లు తెలుస్తోంది.