Lithium: అత్యంత విలువైన లిథియం ఖనిజ నిల్వలు జమ్మూకాశ్మీర్ లో వెలుగులోకి వచ్చాయి. దాదాపుగా 60 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో భారత్ దిశమారబోతోంది. అయితే దీన్ని కనుగొనేందుకు దాదాపుగా 26 ఏళ్ల శ్రమ దాగుంది. 26 ఏళ్ల క్రితమే జీఎస్ఐ జమ్మూ కాశ్మీర్ లోని సలాల్ ప్రాంతంలో లిథియం ఉనికి గురించి ఒక వివరణాత్మక నివేదిక అందించింది. అయితే అప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.
తాజాగా జమ్మూకాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు మంగళవారం గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అత్యంత నాణ్యత కలిగిన లిథియం ఈ ప్రాంతంలో ఉన్నట్లు వెల్లడించింది. 1997లోనే లిథియం ఉన్నట్లు కొనుగొన్నారు. అయితే ఈ అన్వేషనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయలేదు.
Read Also: New Governors: 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కోష్యారీ రాజీనామా ఆమోదం..
ఇది అత్యంత అరుదైన మూలకం. ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద నిల్వలు భారతదేశంలోనే ఉండే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం కొన్ని దేశాల్లోనే ఈ ఖనిజం ఉంది. ప్రపంచంలో అర్జెంటీ, బొలీవియా, చిలీ దేశాల్లనే 50 శాతం లిథియం ఉంది. ఆస్ట్రేలియా, చైనాల్లో కూడా లిథియం గనులు ఉన్నాయి. తాజా ఆవిష్కరణతో ప్రపంచంలో లిథియం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరిపోయింది. ప్రస్తుతానికి భారతదేశం వద్ద లిథియాన్ని తవ్వి తీసే సాంకేతికత లేదు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం వేలం వేసిన తర్వాత ఖనిజాన్ని తవ్వి తీసే ప్రక్రియ ప్రారంభం అవుతుందని గనుల శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు.
ప్రస్తుతం లిథియానికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైళ్లలో వాడే బ్యాటరీ లిథియంను వాడుతున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఇక సలాల్ ప్రాంతంలోని ప్రజలు, తమను అదృష్టం వరించిందని.. మా గ్రామం రూపు రేఖల్ని ఈ రాళ్లు మారుస్తాయని.. రియాసి భవితవ్యాన్ని మారుస్తుందని గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.