Site icon NTV Telugu

Uttar Pradesh: కట్నం కోసం లైంగికంగా వేధించిన అత్తమామలు.. వివాహిత ఏం చేసిందంటే..!

Up

Up

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఒక మహిళ తన భర్త, అత్తమామలు రూ. 2 లక్షల కట్నం ఇవ్వాలంటూ తనను లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. అయితే, 2011లో కమల్ అహ్మద్‌తో పెళ్లి జరిగిన వెంటనే తనపై వేధింపులు ప్రారంభమయ్యాయని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Read Also: Akkineni Akhil : ఎయిర్ పోర్టులో కొత్త జంట..

అయితే, తన అత్తమామలు అస్మా ఖాటూన్, జునైద్ ఆలంలు రూ.2 లక్షల కట్నం తీసుకు రావాలని తనపై ఒత్తిడి చేసి.. అనేకసార్లు కొట్టడంతో పాటు చివరికి ఇంటి నుంచి గెంటేశారని చెప్పుకొచ్చింది. ఇక, తన తండ్రి ఏదో విధంగా లక్ష రూపాయలు ఇచ్చారు.. అయినా కూడా ఆ వేధింపులు ఆగలేదని తెలిపింది. అలాగే, తన మరిది బెలాల్ అహ్మద్ సైతం అనేకసార్లు లైంగికంగా వేధించాడు.. అతడికి అనుకూలంగా ఉండాలంటూ అత్తమామలు కూడా ఒత్తిడి తీసుకొచ్చారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. మరోవైపు, 2019లో తన భర్త ఫిర్దౌస్ అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.. ఆ తర్వాత తనను చంపేస్తానని బెదిరించాడని కంప్లైంట్ లో పేర్కొనింది. అలాగే, తన ఇద్దరు పిల్లలను కూడా నా నుంచి మా అత్తమామలు లాక్కున్నారు.. వారిని నాకు అప్పగించాలని కోరింది.

Read Also: Trump: ఆ రెండు దేశాలు పోట్లాడుకోవడం ఇష్టం లేదు

ఇక, ఈ సంఘటనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాలతో ఆ వివాహిత వరకట్న వేధింపులు, దాడి, హత్య బెదిరింపుల అభియోగాలతో కేసు నమోదు చేసింది. స్టేషన్ ఇన్‌చార్జ్ శివంగి త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ విషయం చాలా సున్నితమైనది.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.. విచారణ తర్వాత తగిన ఆధారాలతో నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

Exit mobile version