Delhi School Bomb Hoax: దేశ రాజధానిలోని పలు స్కూళకు ఈ రోజు బూటకమపు బెదిరింపులు ఎదురయ్యాయి. దాదాపు 100 పాఠశాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అయితే, ఈ కేసుపై అధికారులు విచారణ ప్రారంభించారు. వీటికి ఉగ్రవాద లింక్ ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రష్యాకు చెందిన డొమైన్ ఐపీ అడ్రస్ నుంచి ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ బెదిరింపు ఈమెయిళ్లకు పాకిస్తాన్‌తో సంబంధాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Naveen Chandra :అరుదైనా ఘనత సాధించిన నవీన్ చంద్ర..
పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సూచన మేరకు ఐఎస్ఐఎస్ మాడ్యూల్ ద్వారా బెదిరింపులు పంపినట్లు అనుమానం ఉందని ఒక అధికారి తెలిపారు. పాఠశాలలకు బెదిరింపులు పంపబడిన ఇమెయిల్ ID- sawariim@mail.ru పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఈమెయిల్‌లో sawariim అనేది అరబిక్ పదం, 2014 నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ భారత్‌పై సైబర్ యుద్ధానికి ప్లాన్ చేస్తోందని, అందుకు ఐఎస్‌ఐ సాయం చేస్తోందని ఓ అధికారి తెలిపారు.
బుధవారం ఉదయం ఈమెయిట్ ద్వారా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే విద్యార్థుల్ని ఇళ్లుకు పంపించారు. అధికారులు పాఠశాలల్ని క్షుణ్ణంగా సోదా చేశారు. అయితే, ఇవన్నీ బూటకపు బెదిరింపులని తేల్చారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేరానికి పాల్పడిన వారిని విడిచిపెట్టేది లేదని వీకే సక్సేనా అన్నారు.