Site icon NTV Telugu

Haryana Elections: బీజేపీకి పెరిగిన మరింత బలం.. ఇద్దరు ఇండిపెండెంట్లు చేరిక..

Haryana Election Results

Haryana Election Results

Haryana Elections: 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానాలో పదేళ్ల పాలన తర్వాత బీజేపీ గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి కాంగ్రెస్‌కి ఘోర పరాభవం తప్పలేదు. ఇదిలా ఉంటే హర్యానా ఫలితాల అనంతరం ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం 51కి చేరింది.

Read Also: CM Revanth Reddy: ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. సమస్యలు చెప్పుకున్న ప్రతినిధులు

మాజీ కాంగ్రెస్ మంత్రి సావిత్రి జిందాల్ లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరినప్పటికీ. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆమె 2005, 2009లో ఇక్కడ నుంచి గెలుపొందారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు దేవేందర్ కద్యన్, రాజేష్ జూన్ కూడా బీజేపీలో చేరారు. కద్యన్ బీజేపీ రెబల్ అభ్యర్థిగా గనౌర్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ గెలుపొందారు. రాజేష్ జూన్ బహదూర్‌ఘర్ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి బీజేపీ అభ్యర్థిని ఓడించారు. వీరిద్దరు కేంద్ర మంత్రి, రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ ముగ్గురి చేరితో హర్యానా అసెంబ్లీలో బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఉ(ంది.

Exit mobile version