NTV Telugu Site icon

Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర యూనిట్ రద్దు

Himachalpradeshunit

Himachalpradeshunit

కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర విభాగాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీసీసీ రాష్ట్ర యూనిట్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీల మొత్తం రద్దు ప్రతిపాదనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: KA : ‘క’ సినిమా పాన్ ఇండియా రిలీజ్ డేట్స్ ఇవే.

హిమాచల్‌ మంత్రి అనిరుధ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ని నియమిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఇది సాధారణ చర్యగా పేర్కొన్నారు. పీసీసీ, డీసీసీ, బ్లాక్ యూనిట్ల పదవీకాలం ముగిసినందున వాటిని రద్దు చేయాలనేది హిమాచల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. కాగా ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఇటీవల హిమాచల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌ పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారు. దీని ద్వారా కొత్త కమిటీలలో క్రియాశీల సభ్యులకు ప్రాధాన్యత లభిస్తుందని ఆమె తెలిపారు.

ఇది కూడా చదవండి: Kamala harris: కమలాహారిస్ ఓ యోధురాలు.. కొనియాడిన తమిళనాడు వాసులు

2019లో కూడా ఇదే విధమైన కసరత్తు జరిగింది. కాంగ్రెస్ తన రాష్ట్ర విభాగాన్ని రద్దు చేసినప్పటికీ.. ఆ సంవత్సరం ప్రారంభంలో నియమించబడిన ప్రెసిడెంట్ కులదీప్ సింగ్ రాథోడ్‌ను కొనసాగించింది. ప్రతిభా సింగ్ 2022లో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి ముందున్న వారిలో ఒకరిగా కనిపించారు. కానీ ఆ పదవి సుఖ్వీందర్ సింగ్‌కి దక్కింది.

 

Show comments