Site icon NTV Telugu

Air travel for pilgrims: సీనియర్ సిటిజన్స్‌కు బంఫర్ ఆఫర్.. దేశంలో తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్..

Madhya Pradesh

Madhya Pradesh

Air travel for pilgrims: సీనియర్ సిటిజన్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం విమాన సౌకర్యాన్ని కల్పించింది. దానికి అవసరమయ్యే నిధులను కూడా ప్రభుత్వమే సమకూర్చనుంది. ఇలా తీర్థయాత్రలకు వెళ్లే సీనియర్ సిటిజన్లకు సౌకర్యం కలిపించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆదివారం ఉందయం భోపాల్ లోని రాజా భోజ్ ఎయిర్ పోర్టు నుంచి ‘తీర్థ-దర్శన్ యోజన’ కింద 32 మంది సీనియర్ సిటిజన్స్ విమానంలో ప్రయాణించారు. ఇందులో 24 మంది పురుషులు ఉండగా.. 8మంది స్త్రీలు ఉన్నారు.

Read Also: Rs.2000 Note Withdrawn: “నో ఫారమ్.. నో ఐడీ ఫ్రూఫ్”.. రూ.2000 మార్పిడిపై కీలక ప్రకటన

విమాన ప్రయాణ సౌకర్యం కింద మొదటి దశలో మధ్యప్రదేశ్ లోని వివిధ విమానాశ్రయాల నుంచి జూలై వరకు తొలి బ్యాచ్ భక్తులు ప్రయాణించనున్నారు. ఈ రోజు తన కల నెరవేరిందని, నా తల్లిదండ్రుల్లాంటి వృద్ధుల్ని విమానంలో తీర్థయాత్రలకు తీసుకెళ్తున్నానని రాందాస్ అనే ప్రయాణికుడు చెప్పారు.

2012లో బీజేపీ హాయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ’’తీర్థ-దర్శన్ యోజన’’ పథకాన్ని ప్రారంభించారు. ప్రత్యేక రైళ్ల ద్వారా వృద్ధులను ఉచితంగా తీర్థయాత్రలకు పంపిస్తున్నారు. ఇప్పుడు విమానాల ద్వారా వెళ్లే వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 7.82 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.

Exit mobile version