NTV Telugu Site icon

Economic depression: ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం.. ఐటీ ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి

It Jobs Layoffs

It Jobs Layoffs

Impending economic recession, impact on IT industry: ప్రపంచదేశాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. అమెరికాతో పాటు బ్రిటన్, జర్మనీ ఇతర యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. అధిక ద్రవ్యోల్భనంతో పలు దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ఆయా దేశాలు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుకుంటూపోతున్నాయి. ఈ పరిణామాలు ఐటీ ఉద్యోగులను వణికిస్తున్నాయి. మరో భారీ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందని ప్రపంచ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు సర్వేల ప్రకారం మరో 6-12 నెలల్లో తప్పకుండా ఆర్థిక మాంద్యం తప్పకుండా వస్తుందని అంచానా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందని అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ హెచ్చరించారు. ఈ సీజన్ లో డబ్బులను దాచుకోవాలని ప్రజలకు సలహా ఇచ్చారు. కార్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు వంటివి కొనుగోలు చేయకపోవడమే మంచిదని సూచించారు. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఇటీవల ట్విట్టర్, మెటా వంటి సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి. అయితే ఇదే బాటలో అమెజాన్ కూడా వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తుందని తెలిపింది. వచ్చే ఏడాాది ఖచ్చితంగా ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయి. ఏకంగా 1400 లక్షల కోట్ల అప్పులు కట్టలేని పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్ మందగమం ఉంది. ఓ వైపు మార్కెట్ స్తబ్ధత, ఉద్యోగుల కోతలతో ఆర్థిక మాంద్యం తప్పదని తెలుస్తోంది.

Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఎన్‌కౌంటర్.. నాన్ లోకల్స్‌ని చంపుతున్న ఉగ్రవాది హతం

వాల్ స్ట్రీట్ జర్నల్ ఎకానమిస్టుల్లో 63 శాతానికి పైగా మంది వచ్చే ఏడాది తప్పకుండా ఉంటుందని తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం, ఇంధన రంగ సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి, చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడం ఇలా ఆర్థిక మాంద్యానికి కారణం అవుతున్నాయి. 2023 మార్చ్ నాటికి యూకే మాంద్యంలోకి వెళ్తుందని అంచానా వేస్తున్నారు.

ఊడుతున్న ఉద్యోగాలు:

ఇదిలా ఉంటే ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అమెరికా దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ఆపిల్ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించాయి. దేశీయంగా కూడా టీసీఎస్ ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. విప్రో మూన్ లైటింగ్ పేరుతో 300 మందిని తొలగించింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ అనే ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఇక టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు పలువురు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Read Also: Himanta Biswa Sarma: మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదు.. చరిత్రను తిరగరాయాలి..

అమెరికన్ సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో ఆ ప్రభావం భారత కంపెనీలపై పడే అవకాశం ఉంది. 2008 ఆర్థిక మాంద్యం తరువాత మార్కెట్లు మళ్లీ యధావిదిగా పనిచేసేందుకు రెండేళ్ల సమయం పట్టింది. అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుందనే విధంగా అక్కడి ఐటీ రంగం కుదేలు.. దేశీయంగా ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. భారత్ లో టాప్-3 టెక్ కంపెనీలు జూన్ త్రైమాసికంతో పోలిస్తే, సెప్టెంబర్ త్రైమాసికంలో 60 శాతం నియామకాలను తగ్గించాయి. ఓ రకంగా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ కంపెనీలు జూన్ త్రైమాసికంలో 50 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటే, సెప్టెంబర్ త్రైమాసికంలో 20 వేల మందిని మాత్రమే కొత్తగా రిక్రూట్ చేసుకున్నాయి.

ఈ ఏడాది టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ కంపెనీల షేర్ విలువలు తగ్గాయి. వివిధ కంపెనీల మార్కెట్ క్యాపిలైజేషన్ సగానికి కన్నా తగ్గాయి. మరికొన్ని కంపెనీలు వన్ బై ఫోర్త్ వంతకు చేరాయి. దీంతో వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకునే ఆలోచనల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ట్విట్టర్, మెటా తమ ఉద్యోగుల లేఆఫ్ ప్రకటించింది. ఈ పరిణామాలతో ఐటీ రంగానికి గడ్డు కాలం ఏర్పడుతుందని అంతా భావిస్తున్నారు. మాంద్యంతో ముందుగా ఎఫెక్ట్ అయ్యేది ఐటీ పరిశ్రమే అని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. భారత్ లోని పలు ఐటీ కంపెనీలు ఆందోళనకు గురువుతున్నాయి. ఐటీకి మూలం అయిన అమెరికాలో ప్రభావం పడితే ప్రాజెక్టులు తగ్గుతాయని దీంతోొ భారత ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు రోడ్డున పడిన సంగతి తెలిసిందే.