NTV Telugu Site icon

PM Modi Letter To Palestine: పాలస్తీనా ప్రజలకు ప్రధాని మోడీ లేఖ.. అండగా ఉంటామని వెల్లడి

Modi

Modi

PM Modi Letter To Palestine: పాలస్తీనా ప్రజలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేఖ రాశారు. పాలస్తీనా అభివృద్ధికి తాము మద్దతుగా ఉంటుందని తెలిపారు. పాలస్తీనాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య చాలా కాలంగా యుద్ధం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధం వల్ల వేలాది మంది ప్రజలు చనిపోయారు.. అలాగే, ప్రపంచంలోని చాలా దేశాలు అనేక రకాలుగా నష్టపోయాయని వెల్లడించారు. తక్షణమే కాల్పుల విరమణ, బందీలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి పలకాలని నరేంద్ర మోడీ కోరారు.

Read Also: Asthma Remedies: చలికాలంలో ఆస్తమా సమస్య ఎక్కువతుందా? ఇలా చేసి ఉపశమనం పొందండి

ఇక, భారత ప్రధాని మోడీ రాసిన లేఖపై న్యూఢిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయం స్పందించింది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య శాశ్వత పరిష్కారానికి సంబంధించిన చర్చలు జరగాలని భారతదేశం విశ్వసిస్తుందని ఆ దౌత్య కార్యాలయం ఇన్‌చార్జి అబేద్ ఎల్రాజేజ్ అబు జజార్ తెలిపారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందించడం కొనసాగించడానికి భారత్ తన నిబద్ధతను కలిగి ఉందని పేర్కొన్నారు. త్వరలోనే హమాస్- ఇజ్రాయెల్ మధ్య సమస్యలు పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Show comments