Site icon NTV Telugu

IMD Warning: సెప్టెంబర్‌లోనే అత్యధిక వర్షాలుంటాయి.. ఐఎండీ వార్నింగ్

Imdrain

Imdrain

దేశ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలు రాష్ట్రాలు ఇంకా తేరుకోను లేదు. ఇంతలోనే కేంద్ర వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. సెప్టెంబర్‌లో సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించింది.

సెప్టెంబర్‌లో ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించవచ్చని తెలిపింది. ఇక దక్షణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్‌లో సాధారణం కంటే తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వార్నింగ్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Trump: అలాగైతే అమెరికా నాశనమే.. టారిఫ్ తీర్పుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

సగటున 167.9 మి.మీ వర్షపాతం నమోదు కావొచ్చని.. సాధారణ వర్షపాతం 109 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: US: హూస్టన్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. నదులు తలపిస్తున్న రహదారులు

ఉత్తరఖాండ్‌లో చాలా నదులు వరదలకు గురవుతాయని.. నగరాలు, ప్రట్టణాలు ప్రభావితం అవుతాయని చెప్పారు. అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మహానది నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీంతో వరద ఉధృతం అయి అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆయా రాష్ట్రాలు తీవ్ర విపత్తును ఎదుర్కొంటున్నాయి. ఇంతలోనే వాతావరణ శాఖ.. సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు ఉంటాయని చెబుతోంది. ముందు.. ముందు వర్షాలు ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version