IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
- రుతుపవనాలపై కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త
- తెలంగాణలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
- రాబోయే 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రుతుపవనాలపై కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు జూన్ 23వ తేదీ నుంచి తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వారంలో ఈశాన్య భారతదేశం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను రుతుపవనాలు ఆవరిస్తున్నాయని తెలిపింది.
మధ్యప్రదేశ్‌లో జూన్ 21 వరకు.. విదర్భలో 20వ తేదీ వరకు.. తెలంగాణలో జూన్ 19 వరకు, ఛత్తీస్‌గఢ్‌లో జూన్ 17 వరకు కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల (heat wave) పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇక ఈరోజు ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. గంగా తీర పశ్చిమ బెంగాల్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, మిజోరాంలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తూర్పు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో అక్కడక్కడా గంటకు 60-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, హర్యానా, విదర్భ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లలో అక్కడక్కడా గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒడిశా, విదర్భలలోని అక్కడక్కడా వడగాలుల పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..