Site icon NTV Telugu

Heatwave Warning: ఢిల్లీకి రెడ్ అలర్ట్.. 3 రోజులు తీవ్ర వేడిగాలులు ఉంటాయని హెచ్చరిక

Imdwarning

Imdwarning

దేశ రాజధాని ఢిల్లీని నిన్నామొన్నటి దాకా దుమ్ము తుఫాన్ హడలెత్తించింది. ఇప్పుడు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిన్నటి నుంచి వేడి గాలులు తీవ్రమయ్యాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. తీవ్ర వేడిగాలుల కారణంగా ఉక్కపోత, చెమటలతో అల్లాడిపోతున్నారు. సోమవారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా… మంగళవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనాలు బాబాయ్ అంటూ ఇబ్బందిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Sonam Raja Wedding: సోదరుడి మరణాన్ని క్యాష్ చేసుకుంటున్న రాజా సోదరి.. పెళ్లి వీడియోలు వైరల్ చేస్తు్న్న ఇన్‌ఫ్లుయెన్సర్

ఇదిలా ఉంటే కేంద్ర వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజులు వేడిగాలులు ఉంటాయని హెచ్చరించింది. అనంతరం వేడిగాలుల తర్వాత తుఫానులు, వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమవారం వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మంగళవారం రెడ్ అలర్ట్ చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా పేర్కొంది.

ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: మే 23న సోనమ్‌కు అత్త ఫోన్ కాల్.. రాజా గురించి అడిగితే ఏం సమాధానం చెప్పిందంటే..!

అధికారిక లెక్కల ప్రకారం.. సఫ్దర్‌జంగ్‌లో 43.4 డిగ్రీలు, పాలంలో 44.3 డిగ్రీలు, లోడి రోడ్‌లో 43.3 డిగ్రీలు, రిడ్జ్‌లో 44.9 డిగ్రీలు, ఆయా నగర్‌లో 45.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారంతో పోలిస్తే 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగినట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. గురువారం నాటికి ఢిల్లీ అంతటా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. సాయంత్రం మాత్రం స్వల్ప ఉపశమనం లభించొచ్చని పేర్కొంది.

Exit mobile version