Site icon NTV Telugu

Cyclone: కోల్‌కతాకు తుఫాన్ ముప్పు.. మరో 18 రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

Cyclone

Cyclone

కోల్‌కతాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఇరాక్-బంగ్లాదేశ్‌ కేంద్రంగా తుఫాన్ ఏర్పడిందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్ సహా మరో 18 రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: Minister Narayana: టిడ్కో ఇళ్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి..

తుఫాన్ కారణంగా ఉత్తర భారతదేశంతో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 15 వరకు జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో హిమపాతంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సుంది. మార్చి 13న పంజాబ్, హర్యానాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. ఇక మార్చి 15 వరకు రాజస్థాన్‌లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే తూర్పు రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో మార్చి 15 వరకు వర్షాలు కురుస్తాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం సంభవించవచ్చని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Aamir Khan : బాలీవుడ్ పడిపోవడానికి కారణం ఇదే..

దక్షిణాది రాష్ట్రాలను కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, కేరళలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పరిస్థితులు చేదాటితే స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ఇవ్వాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఇక ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Russia-Ukraine: శాంతి చర్చల్లో భాగంగా రష్యా ఏం చేసిందంటే…!

Exit mobile version