Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Iit Guwahati Dean Resigns Amid Massive Student Protest Over Academic Pressure

IIT-Guwahati: విద్యార్థి ఆత్మహత్య.. ఉద్రిక్తతలకు దారి తీసిన నిరసనలు.. ప్రొఫెసర్ రాజీనామా

Published Date :September 11, 2024 , 3:30 pm
By Suresh Maddala
  • ఐఐటీ గౌహతిలో విద్యార్థి ఆత్మహత్య
  • ఉద్రిక్తతలకు దారి తీసిన నిరసనలు
  • ఐఐటీ గౌహతి డీన్.. ప్రొఫెసర్ కృష్ణ రాజీనామా
IIT-Guwahati: విద్యార్థి ఆత్మహత్య.. ఉద్రిక్తతలకు దారి తీసిన నిరసనలు.. ప్రొఫెసర్ రాజీనామా
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐఐటీ గౌహతిలో ఓ విద్యాకుసుమం రాలిపోయింది. విద్యావ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా ప్రతిభావంతుడైన విద్యార్థి ప్రాణాలు పోయాయి. దీంతో పరిపాలనా భవనం ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. విద్యార్థి మృతికి ఒత్తిడే కారణమని ఆరోపించారు. దీంతో నిరసనలకు తలొగ్గి ఐఐటీ-గౌహతి డీన్, ప్రొఫెసర్ కందూరు వి.కృష్ణ రాజీనామా చేశారు.

ఇది కూడా చదవండి: IPS Ashna Success Story: మోడల్ నుంచి ఐపీఎస్‌.. అందమైన పోలీస్ అధికారిణి సక్సెస్ స్టోరీ.. ‌‌‌

ఐఐటీ-గౌహతిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి సెప్టెంబర్ 9న కాలేజీ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు ఐఐటీ గౌహతి అడ్మినిస్ట్రేషనే కారణమని విద్యార్థులు ఆరోపించారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ హాజరు తక్కువగా ఉండడంతో చాలా మంది విద్యార్థులను ఫెయిల్ చేశారని.. కనీసం 200 మంది విద్యార్థులకు హాజరు లేనందుకు ఫెయిల్ అయ్యారని విద్యార్థులు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కూడా ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని తెలిపారు. బాధిత విద్యార్థి తెలివైనవాడని.. ఇంటర్న్‌షిప్ కూడా విజయవంతంగా పూర్తి చేశాడని ఓ విద్యార్థి చెప్పుకొచ్చాడు. కేవలం అడ్మినిస్టేషన్ తీరు కారణంగానే కొన్ని పేపర్లలో విఫలమయ్యాడని ఆరోపించారు. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నట్లు వివరించాడు. బాధిత విద్యార్థి ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడిగా గుర్తించారు. మృతుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చదువుతున్నాడు.

ఇది కూడా చదవండి: IC 814 Hijack: ఐసీ 814 విమానంలో ‘రా’ ఏజెంట్.. ఉగ్రవాదులకు తెలిస్తే ఖచ్చితంగా తలనరికే వారు..

విద్యార్థి మృతిని నిరసిస్తూ పెద్ద ఎత్తున పరిపాలన భవనాన్ని ముట్టడించారు. డీన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఐఐటీ-గౌహతి డీన్, ప్రొఫెసర్ కందూరు వీ కృష్ణ రాజీనామా చేశారు. ఇతడు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి గణితంలో మాస్టర్స్ చేసి పీహెచ్‌డీ పూర్తి చేశారు.

విద్యార్థి ఆత్మహత్య బాధాకరమని ఐఐటీ-గౌహతి ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక సానుభూతిని తెలిపింది. విద్యార్థులందరికీ సురక్షితమైన, సహాయ వాతావరణాన్ని అందించడానికి కృషి చేస్తామని స్పష్టం చేసింది.

Guwahati

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Academic pressure
  • Dean resigns
  • IIT Guwahati
  • Professor Kanduru V Krishna
  • Student death

తాజావార్తలు

  • Astrology: మార్చి 23, సోమవారం దినఫలాలు.. ఇవాళ ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions