ఐఐటీ గౌహతిలో ఓ విద్యాకుసుమం రాలిపోయింది. విద్యావ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా ప్రతిభావంతుడైన విద్యార్థి ప్రాణాలు పోయాయి. దీంతో పరిపాలనా భవనం ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. విద్యార్థి మృతికి ఒత్తిడే కారణమని ఆరోపించారు. దీంతో నిరసనలకు తలొగ్గి ఐఐటీ-గౌహతి డీన్, ప్రొఫెసర్ కందూరు వి.కృష్ణ రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: IPS Ashna Success Story: మోడల్ నుంచి ఐపీఎస్.. అందమైన పోలీస్ అధికారిణి సక్సెస్ స్టోరీ..
ఐఐటీ-గౌహతిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి సెప్టెంబర్ 9న కాలేజీ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు ఐఐటీ గౌహతి అడ్మినిస్ట్రేషనే కారణమని విద్యార్థులు ఆరోపించారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ హాజరు తక్కువగా ఉండడంతో చాలా మంది విద్యార్థులను ఫెయిల్ చేశారని.. కనీసం 200 మంది విద్యార్థులకు హాజరు లేనందుకు ఫెయిల్ అయ్యారని విద్యార్థులు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కూడా ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని తెలిపారు. బాధిత విద్యార్థి తెలివైనవాడని.. ఇంటర్న్‌షిప్ కూడా విజయవంతంగా పూర్తి చేశాడని ఓ విద్యార్థి చెప్పుకొచ్చాడు. కేవలం అడ్మినిస్టేషన్ తీరు కారణంగానే కొన్ని పేపర్లలో విఫలమయ్యాడని ఆరోపించారు. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నట్లు వివరించాడు. బాధిత విద్యార్థి ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడిగా గుర్తించారు. మృతుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చదువుతున్నాడు.
ఇది కూడా చదవండి: IC 814 Hijack: ఐసీ 814 విమానంలో ‘రా’ ఏజెంట్.. ఉగ్రవాదులకు తెలిస్తే ఖచ్చితంగా తలనరికే వారు..
విద్యార్థి మృతిని నిరసిస్తూ పెద్ద ఎత్తున పరిపాలన భవనాన్ని ముట్టడించారు. డీన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఐఐటీ-గౌహతి డీన్, ప్రొఫెసర్ కందూరు వీ కృష్ణ రాజీనామా చేశారు. ఇతడు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి గణితంలో మాస్టర్స్ చేసి పీహెచ్‌డీ పూర్తి చేశారు.
విద్యార్థి ఆత్మహత్య బాధాకరమని ఐఐటీ-గౌహతి ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక సానుభూతిని తెలిపింది. విద్యార్థులందరికీ సురక్షితమైన, సహాయ వాతావరణాన్ని అందించడానికి కృషి చేస్తామని స్పష్టం చేసింది.