Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆత్మహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
- సాహిల్ వాకోడే మృతిలో కీలక పరిణామం..
- ఆత్మహత్యకు ముందు స్నేహితురాలికి ఫోన్..
- ఐఐటీ బాంబే స్టూడెంట్ డెత్ కేసులో సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారింది. ఫ్రొపెసర్లు కులం పేరుతో వేధించడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని సాహిల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పరీక్షా సమయంలో చాట్‌జీపీటీ ద్వారా సమాధానాలు పొందే ప్రయత్నం చేయడంతో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు పంపించారనే వాదన ఉంది. సాహిల్ మృతిపై ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఎగ్జామ్ హాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు కారిడార్లలోని దృశ్యాలను పరిశీలిస్తోంది. సాహిల్ ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ గది వరకు అతడి కదలికల్ని దర్యాప్తు చేస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు, సాహిత్ తన స్నేహితురాలితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘‘నేను తప్పు చేశాను. నా థర్మో డైనమిక్స్ పేపర్ కూడా సరిగా రాయలేదు. ఇప్పుడు ఇది జరిగింది’’ అని చెప్పినట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. ఈ సంభాషణల్లో ఎలాంటి కుల వివక్ష ప్రస్తావనను సాహిల్ ప్రస్తావించనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాహిల్ తన స్నేహితురాలితో సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 2.30 గంటలకు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాహిల్ తన ఫోన్‌కు స్పందించలేదని పోలీసుల ముందు ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. సాహిల్ మరణవార్త విని తాను చాలా ఆందోళన చెందినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
సాహిల్ మరణానికి ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా కారణమని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. దూల్లాతో పాటు ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ కేదారేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు కులవివక్ష ఎదుర్కొన్నాడని, ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వారు ఆరోపించారు. ఇదిలా ఉంటే, దూల్లాకు బాంబే ఫ్యాకల్లీ ఫోరం, ఇతర ఐఐటీల ఉపాధ్యాయులు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు విద్యార్థులు కూడా ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. IIT బాంబే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ 10 మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్ రమేశ్ వెంకటేశ్వరన్ నేతృత్వంలోని కమిటీ సహిల్ మృతికి దారితీసిన పరిస్థితులను పరిశీలించనుంది. కమిటీ వారంలోగా నివేదిక ఇవ్వాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
-
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!