Site icon NTV Telugu

Bengaluru : ఓరి నాయనో.. అద్దెకు ఇల్లు కావాలంటే ముందుగా రూ. 25 లక్షలు కట్టాలా?

Bengulure

Bengulure

బెంగుళూరులో అద్దెకు ఇల్లు తీసుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.. ఏకంగా లక్షలు చెల్లించుకోవాలట..మొన్న ఏమో 90% మార్కులు ఉంటే ఇల్లు ఇస్తానని చెబుతున్నారు.. అలాగే ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తేనే ఇస్తామని అంటున్నారు.. బెంగళూరులో ఇంటి అద్దెలు ఇలాగే ఉన్నాయి. నో బ్రోకర్ యాప్‌ లో లిస్ట్ అయిన ఈ ఇంటి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు… ఆ ఇల్లు కోసం ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.25 లక్షలు, నెలకు 2.5 లక్షలు అని పేర్కొన్నారు.. అది కాస్త నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది..

ఈ ఇల్లు 5,195 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇల్లు హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌ లో ఉందని ఆ నెటిజన్ పేర్కొన్నారు. అయితే, ఈ ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ అంశం ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.. ప్రకటన కిందే లోన్ పొందే ఆప్షన్ కూడా ఉండటంతో జనాల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. లోన్ ఆప్షన్‌తో పాటూ పక్కనే కిడ్నీ దానానికి సంబంధించి ఆప్షన్ కూడా ఉంటే బాగుండేదంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఏప్రిల్‌లో బెంగళూరులోని ఒక బ్యాచిలర్‌కు విడిచిపెట్టిన ఫ్లాట్.. చూడటానికి అది చెత్తతో దయనీయమైన స్థితిలో ఉంచిన ఫోటోలను ఒక వ్యక్తి ట్విట్టర్‌లో పంచుకున్నాడు. పాడ్‌కాస్ట్ హోస్ట్ అయిన రవి హండా, తాను రెడ్డిట్ నుండి పొందానని చెప్పిన ఫోటోలను పంచుకున్నాడు. ఎంఎన్‌సిలో పనిచేసిన ‘చదువుకున్న బ్రహ్మచారి’ ఫ్లాట్‌ను ఇలా వదిలేశాడని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ చూసినా లెక్కలేనన్ని ఖాళీ బీరు సీసాలతో ఆ ప్రదేశమంతా చెత్త కుప్పలా కనిపించింది. స్లాబ్ చుట్టూ వ్యర్థాలు పడి ఉండటం, అన్ని విరిగిపోవడంతో వంటగది చాలా అపరిశుభ్రంగా ఉంది. ఫ్లాట్‌లో చెత్త పేరుకుపోయి చాలా కాలంగా శుభ్రం చేయనట్లుగా ఉంది.. ఇలాంటి ఇళ్ళకే ఇంత రెంట్ ఉంటే ఇక కొత్త ఇళ్లకు కోట్లల్లో ఉంటాయేమో అని జనాలు ఆశ్చర్య పోతున్నారు..

Exit mobile version