NTV Telugu Site icon

Rahul Gandhi: మేం అధికారంలోకి వస్తే రైతుల గొంతుక అవుతాం..

India Bloc

India Bloc

Rahul Gandhi: తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌తో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ‘కిసాన్ మహాపంచాయత్’లో ప్రసంగించారు. నాసిక్ ఉల్లి, ద్రాక్ష, టొమాటోల సాగుకు ప్రసిద్ధి. మహాపంచాయత్ సభ సందర్భంగా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు.

Read Also: Indian Bank Recruitment 2024: ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు, చివరి తేదీ?

టొమాటో ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధర రావడంతో కేంద్ర ప్రభుత్వం నేపాల్ నుంచి టొమాటోలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిందని దీంతో హోల్ సేల్ మార్కెట్‌లో ధరలు లేక నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇది విధంగా ఉల్లికి మంచి రేటు వస్తున్నప్పుడు ఎగుమతుల్ని నిషేదించారు. ఉల్లి ఎగుమతులపై ఆంక్షల కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ద్రాక్షపై దిగుమతి సుంకాలను ప్రకటించిందని, దీంతో స్థానిక రైతులు నష్టపోయారని రైతులు తెలిపారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు రైతు వ్యతిరేక విధానాలని రైతులు ఆరోపించారు. రైతులకు భరోసానిస్తూ.. ఇండియా కూటమి ప్రభుత్వం రైతుల గొంతుకగా నిలుస్తుందని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు కృ‌షి చేస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రైతులకు కూటమి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన అన్నారు.