Rajastan: పేపర్ లీకేజీకి పాల్పడితే ఇక యావజ్జీవమే… బిల్లు చేయనున్న రాజస్థాన్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajastan: ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక రాష్ట్రంలో జరిగి.. మరొక రాష్ట్రంలో జరగడం లేదనేది లేదు. ఈ ఏడాదిలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు ముందుగానే లీకయ్యాయి. ప్రశ్నా పత్రాల లీకేజీతో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని పేర్కొంటూ ఏకంగా ఈడీని విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అలానే రాజస్థాన్‌లోనూ పోటీ పరీక్షల లీకేజీ జరిగింది. గతంలో గుజరాత్‌లోనూ జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాల్లో ఈ లీకేజ్ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని జనరల్‌గా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా.. పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీకి పాల్పడితే ఇకపై జీవిత ఖైదు విధించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు ఆ రాష్ట్ర సీఎం ట్విట్ చేశారు.
Read also: Venkatesh : స్వామి వివేకానంద వెబ్ సిరీస్ లో నటించాలనుకున్న వెంకటేష్.. కానీ కుదరలేదుగా..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
పేపర్ లీకేజీకి చెక్ పెడుతూ.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోటీ పరీక్షల్లో పేపర్లు లీక్ చేసిన వారికి ఇకపై యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా కాపీయింగ్ మాఫియాకు గరిష్ట శిక్షగా జీవిత ఖైదు విధించే నిబంధనను జోడించనున్నారు. ఈ సందర్బంగా సీఎం అశోక్ గహ్లోత్ ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలో జరిగే పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు ఉత్తమ విధానం రూపొందించాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పేపర్ లీక్‌లపై నమోదయ్యే కేసుల్లో శిక్షను పెంచేందుకు బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని.. ప్రస్తుతం ఉన్న పదేళ్ల శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని నిర్ణయించామని ట్విట్టర్లో పేర్కొన్నారు.
Read also: Niharika-Chaitanya Divorce: నిహారిక-చైతన్య విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరో తెలుసా?
లీకేజీ మాఫియాపై రాజస్థాన్ ప్రభుత్వం గతేడాది కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ యాంటీ కాపీయింగ్ చట్టం ప్రకారం 10 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించారు. కొత్త యాంటీ కాపీయింగ్ చట్టం అమల్లోకి వచ్చినా తరువాత కూడా రాజస్థాన్‌లో నాలుగు పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. పదే పదే పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కాపీయింగ్ మాఫియాను అరికట్టేందుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ నిర్ణయం గురించి సమాచారాన్ని పంచుకున్న తర్వాత రాజస్థాన్ నిరుద్యోగ ఇంటిగ్రేటెడ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేన్ యాదవ్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ధన్యవాదాలు తెలిపారు. పేపర్ లీక్ మాఫియాలకు చట్ట భయం ఉండేలా కఠినంగా శిక్షించాలని తాను చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నానని ఉపేన్ యాదవ్ అన్నారు. కఠిన శిక్షలు విధించడం వల్ల పేపర్ లీక్ మాఫియాలో భయానక వాతావరణం నెలకొంటుందని, దీంతో పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిరుద్యోగుల పోరాట విజయమని ఉపేన్ యాదవ్ తెలిపారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!