Danish Kaneria: ‘‘తప్పు చేయకుంటే, పాక్ ఆర్మీ ఎందుకు అప్రమత్తమైంది’’.. మాజీ క్రికెటర్ కనేరియా ఫైర్..
- మీ తప్పు లేకుంటే, ఆర్మీ ఎందుకు అప్రమత్తమైంది..
- పాక్ తీరుపై సొంత దేశ మాజీ క్రికెటర్ కనేరియా ఆగ్రహం..
- పహల్గామ్ అటాక్‌పై పాకిస్తాన్ తీరును ఎండగడుతున్న కనేరియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danish Kaneria: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా ఆగ్రహం సొంత దేశంపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్తాన్ తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అతికొద్ది మంది హిందూ ఆటగాళ్లలో కనేరియా ఒకరు. మంగళవారం జరిగిన ఉగ్ర ఘటనపై ఆయన మరోసారి స్పందించారు.
28 మందిని బలిగొన్న ఉగ్ర ఘటనపై పాకిస్తాన్ ప్రమేయాన్ని ప్రత్యక్షంగా ఎత్తి చూపారు. ఎక్స్ వేదికగా ‘‘ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ పాత్ర నిజంగా లేకపోతే, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇంకా ఎందుకు ఖండించలేదు?’’ అని ప్రశ్నించారు. ‘‘పాక్ ఆర్మీ ఆకస్మత్తుగా ఎందుకు అప్రమత్తమైంది..? ఎందుకంటే మీకు నిజం తెలుసు. మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచుతున్నారు. ఇది మీకు సిగ్గు చేటు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
దీనికి ముందు మంగళవారం ఉగ్రవాద దాడిపై ఆయన స్పందించారు. ‘‘‘‘బంగ్లాదేశ్ నుంచి బెంగాల్, కాశ్మీర్ వరకు అదే మనస్తత్వం హిందువుల్ని లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ ఈ లౌకికవాదులు, న్యాయవ్యవస్థ దాడి చేసిన వారిని అణిచివేయబడిన మైనారిటీగా ముద్రవేస్తోంది’’ అని ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. తన పోస్టులో భర్తను కోల్పోయిన మహిళ, అతడి మృతదేహం పక్కన దీనంగా కూర్చుని ఉన్న ఫోటోని జత చేశారు.
If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.
— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..