Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన దేశంలో చర్చనీయాశంగా మారింది. ఇంట్లోకి దూరిన దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగుడు ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా పారిపోవడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Read Also: BRS Rythu Dharna: ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారు: కేటీఆర్
వైద్యులు 5 గంటల పాటు శస్త్రచికిత్స చేసి వెన్నుముకలో ఇరుక్కుపోయిన 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కను తొలగించారు. ‘‘ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ అద్భుతంగా ఉన్నారు, మేము అతడిని నడిచేలా చేశాము. ఎలాంటి సమస్య లేదు’’ అని లీలావతి ఆసుపత్రి డాక్టర్ నితిన్ నారాయణ్ డాంగే ఈరోజు మీడియా సమావేశంలో అన్నారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చినట్లు తెలిపారు. వెన్నెముక గాయం కారణంగా వారం రోజుల పాటు సందర్శకులు రావడాన్ని పరిమితం చేసినట్లు వెల్లడించారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంలో ఇలా చేసినట్లు వెల్లడించారు. పక్షవాతం వచ్చే ప్రమాదం లేదని తెలిపారు.
లీలావతి ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరాజ్ ఉత్తమని మాట్లాడుతూ, సైఫ్ “సింహంలా” ఆసుపత్రిలోకి నడిచాడని, అతని కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌తో కలిసి ఉన్నారని అన్నారు. ఆయన స్ట్రెచర్ కూడా ఉపయోగించలేదని ఆయన అన్నారు. సైఫ్ అలీ ఖాన్ చాలా అదృష్టవంతుడని, కత్తి మరో 2 మి.మీ లోతుగా వెళ్లి ఉంటే తీవ్రమైన గాయం అయ్యేదని చెప్పారు.