NTV Telugu Site icon

Sukesh Chandrasekhar: నేను పెద్ద దొంగను అయితే కేజ్రీవాల్ “మహా దొంగ”..

Sukesh Chandrashekhar

Sukesh Chandrashekhar

If I am biggest thug, then Kejriwal is ‘maha thug’, says conman Sukesh: మనీలాండరింగ్, దోపిడి కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామలతో లింకులు, అవినీతి ఆరోపణల కారణంగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు సుకేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం ఢిల్లీలోని మండోలే జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆప్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు. జైలులో ఉనన తనకు రక్షణ కోసం రూ. 10 కోట్లను ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు చెల్లించాలని చెబుతూ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎల్జీకి లేఖ రాసిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే మరోసారి ఎల్జీకి ఫిర్యాదు చేస్తూ మరో లేఖ రాశాడు సుకేష్ చంద్రశేఖర్. ఎల్జీకి ఫిర్యాదు చేసినందుకు ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్, తీహార్ జైలు మాజీ డీజీ బెదిరిస్తున్నారని లేఖ రాశారు.

Read Also: President Murmu Dance : సీఎం భార్యతో స్టేజ్ పైన స్టెప్పులేసిన రాష్ట్రపతి

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనకు 2015 నుంచి తెలుసని లేఖలో పేర్కొన్నాడు సుకేష్, దక్షిణ భారతదేశంలో పార్టీకి సంబంధించి ముఖ్యమైన పదవి ఇస్తానని హామీ ఇచ్చినందుకు రూ. 50 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించినట్లు లేఖలో పేర్కొన్నాడు. దేశంలోనే నన్ను పెద్ద దొంగగా పేర్కొంటున్న కేజ్రీవాల్.. నా దగ్గర నుంచి రూ. 50 కోట్లు తీసుకుని, రాజ్యసభ పదవిని ఆఫర్ చేసిన మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ‘‘ మహా దొంగ’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను బిగ్గెస్ట్ థగ్ అయితే మీరు మహథగ్ ’’ అని లేఖలో పేర్కొన్నాడు.

ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 500 కోట్ల విరాళం ఇచ్చేలా 20-30 మందిని తీసుకురావాలని నన్ను బలవంతం చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు సుకేష్ చంద్రశేఖర్. ఇదిలా ఉంటే గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటనను పక్కదారి పట్టించేందుకే సుకేష్ ఆరోపణలు చేస్తున్నట్లు కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ప్రముఖుల నుంచి డబ్బును వసూలు చేశాడన్న ఆరోపణలో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు సుకేష్. గతంలో తీహార్ జైలులో ఉన్నప్పుడు.. తనకు ప్రాణహాని ఉందని పదేపదే ఆరోపించిన నేపథ్యంలో మండోలి జైలుకు మార్చారు అధికారులు. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కూడా ఈ ఏడాడి మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది.