NTV Telugu Site icon

Tamilisai: ‘‘బీఫ్ తినడం సరైనది అయితే, గోమూత్రం ఎందుకు కాదు’’.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు..

Tamili Sai

Tamili Sai

Tamilisai: తమిళనాడు బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక వర్గం గొడ్డు మాంసం తింటామని చెబుతోంది, అది వారి హక్కు. మరో వర్గం తమ వ్యాధులను నయం చేయడానికి గోమూత్రం ఉపయోగిస్తారు. దీనిపై ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు..? ’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘తన తండ్రి జ్వరానికి గోమూత్రంతో చికిత్స చేస్తున్నానని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి వ్యాఖ్యానించారు’’. ఆయన వ్యాఖ్యలకు తమిళిసై మద్దతుగా నిలిచారు.

Read Also: HYDRA PS: బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్

కామకోటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..ఒక సన్యాని తన తండ్రి తీవ్ర జ్వరానికి గోమూత్రాన్ని మందుగా ఉపయోగించాని అన్నారు. గోమూత్రం తాగిన 15 నిమిషాల్లోనే జ్వరం తగ్గిందని చెప్పారు. గోమూత్రంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయని మరియు కడుపు చికాకు కలిగించే వ్యాధి చికిత్సకు సహాయపడుతుందని ఆయన అన్నారు. దీనిపై కొందరు విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ఇలా సూడోసైన్స్‌ని ప్రచారం చేయడం అభ్యంతరకరం అని అన్నారు. డీఎంకే నేత ఎలంగోవన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వ్యాధుల్ని తగ్గించడానికి గోమూత్రం తాగమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఐఐటీకి బదులుగా కామకోటిని ఎయిమ్స్‌కి బదిలీ చేయాలని ఎలంగోవన్ అన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కామకోటికి మద్దతు తెలిపారు. డీఎంకే, ఇతర పార్టీలు దీనిని రాజకీయం చేయాలని చూస్తు్న్నాయని ఆరోపించారు. ప్రొఫెసర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవిగా పేర్కొన్నారు.