NTV Telugu Site icon

Vegetable oils: పదే పదే వంటనూనెను వేడి చేస్తున్నారా..? అయితే మీరు క్యాన్సర్ రిస్కులో పడ్డట్లే..

Oils

Oils

Vegetable oils: వంట కోసం ఉపయోగించే వెజిటెబుల్ ఆయిల్స్‌ని పదేపదే వేడి చేయడం వల్ల ఆరోగ్యం తీవ్ర ప్రభావం ఉంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన గైడ్‌లైన్స్‌‌లో ఈ విషయాన్ని పేర్కొంది. వెజిటెబుల్ నూనెలను తరుచుగా వేడి చేస్తుండటం వల్ల ఇది విషపూరిత సమ్మేళనాలకు దారి తీస్తుందని, ఇది హృదయ సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోందని వైద్య పరిశోధన సంస్థ వెల్లడించింది. గతంలో జరిగిన పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని తెలిపాయి. వంట నూనెలను పదేపదే వేడి చేయడం వల్ల విషపూరిత పదార్థాల విడుదలకు దారి తీస్తుందని, ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ని పెంచుతుందని ఇది దీర్ఘకాలిక వ్యాధులతో పాటు క్యాన్సర్లకు దారి తీస్తుందని చెప్పింది.

పదేపదే వెజిటెబుల్ ఆయిల్/ కొవ్వులను వేడి చేయడం వల్ల ఇది పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్(PUFA) ఆక్సీకరణం చెందుతుంది. ఇది హానికరమైన సమ్మేళనాల ఉత్పత్తికి దారి తీస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల వద్ద, నూనెలోని కొన్ని కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్‌లుగా మారుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె జబ్బులను ప్రేరేపిస్తాయి. నూనెలను తిరిగి ఉపయోగించేటప్పుడు ట్రాన్స్ ఫ్యాట్ మొత్తం పెరుగుతుంది.

Read Also: IPL 2024: సన్ రైజర్స్-గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే..?

వెజిటెబుల్ ఆయిల్స్‌ని ఒకసారి ఫ్రై కోసం వాడిన తర్వాత దానిని ఫిల్టర్ చేసి కూరలు చేసుకోవడానికి వాడొచ్చు. అయితే, మళ్లీ ఇదే నూనెను తిరిగి ఫ్రూ చేయడానికి వాడొద్దని ఐసీఎంఆర్ సూచించింది. అదే విధంగా ఈ నూనెను ఒక రోజు లేదా రెండు రోజులు మాత్రమే వాడాలని చెప్పింది. దీనిని చాలా కాలం పాటు స్టోర్ చేసుకోవడం మానేయాలని హెచ్చరించింది. ఎక్కువ కాలం నిలువ చేస్తే నూనెల క్షీణత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

వెజిటెబుల్ ఆయల్స్‌ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ట్రాన్స్ ఫ్యాట్స్, అక్రిటమైడ్ వంటి హానికరమైన సమ్మేళనాలు ఏర్పడుతాయని, ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెప్పింది. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఒకే నూనెను పదేపదే ఉపయోగించకుండా ‘‘హై స్మోక్ పాయింట్’’ ఉన్న అవకాడో లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్స్ వాడటం బెటర్ అని బెటర్ అని ఐసీఎంఆర్ తెలిపింది. దీని వల్ల ఆరోగ్య ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపింది. నూనెను మళ్లీ వేడి చేయడం వల్ల క్యాన్సర్‌లతో పాటు ఇతర ఆరోగ్య పరిణామాలు సంభవిస్తాయి. నూనె వేడితో విచ్చిన్నం కావడంతో, అది ఆల్డిహైడ్ వంటి హానికమైన టాక్సిన్స్‌ని విడుదల చేస్తుందని, ఇది ఆమ్లంగా మారి, జీర్ణవ్యవస్థను చికాకు పెడుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల్ని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.