State Elections: ఈ ఏడాది చివర్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఉన్నాయి. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే IANS CVoter సర్వే సంస్థ ఈ రాష్ట్రాల్లో ప్రజలు ఆగ్రహం ఏ విధంగా ఉంది. తమ రాష్ట్రాల సీఎంలు, ఎమ్మెల్యేలపై వారి అభిప్రాయం ఎలా ఉందనే సర్వే నిర్వహించింది. IANS CVoter Anger Index విడుదల చేసింది. ముఖ్యంగా తెలంగాణ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలపై అక్కడి ప్రజల్లో కోపం ఎక్కువగా ఉందని ఈ సర్వేలో తేలింది. తెలంగాణ సీఎం కేసీఆర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లపై ప్రజలు మండిపోతున్నారని వెల్లడించింది.
ప్రజాభిమానంలో బఘేల్, శివరాజ్ సింగ్ టాప్:
ఇదిలా ఉంటే తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం తక్కువగా ఉందని తెలిపింది. ముఖ్యమంత్రుల్లో ప్రజాగ్రహం తక్కువగా ఉన్న సీఎంలో చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ మొదటిస్థానంలో ఉండగా.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత స్థానంలో ఉన్నారు. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అత్యంత ప్రజాధరణ ఉన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. రాష్ట్రపాలనపై సంతృప్తిగా ఉన్న 100 మందిలో కేవలం 25.4 శాతం మంది మాత్రమే ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. తర్వాత స్థానంలో 27 మంది మాత్రమే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై కోపంగా ఉన్నారు.
Read Also: Anurag Thakur: “ద్వేషానికి మెగా మాల్”.. ఇండియా కూటమిపై మంత్రి విమర్శలు..
కేసీఆర్, గెహ్లాట్‌పై మండిపోతున్న ఓట్లరు:
అయితే అనూహ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏకంగా 50.2 శాతం మంది ఓట్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, తర్వాతి స్థానంలో 49.2 శాతం మందితో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఆరు రాష్ట్రాల్లో వీరిద్దరిపైనే ప్రజలు అత్యధిక కోపంతో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై 35.1 శాతం, మిజోరా సీఎం జోరంతంగాపై 37.1 శాతం ఓటర్లు కోపంతో ఉన్నారని సర్వే తేల్చింది.
ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహాన్ని పరిశీలిస్తే.. చత్తీస్ గడ్ 44 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై, తెలంగాణలో 27.6 శాతం, రాజస్థాన్ లో 28.3 శాతం, ఏపీలో 44.9 శాతం, మిజోరంలో 41.2 శాతం, మధ్యప్రదేశ్ లో 40.4 శాతం ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారని సర్వే వెల్లడించింది.