IAF Plane Crash: “అస్సాం గగనతలంలో ఘోర క్రాష్.. నేలకొరిగిన ఐదుగురు దేశ వీర జవానులు!”

  • జోర్హాట్ రన్‌వేపై మృత్యుఘోష..
  • ముక్కలైన యుద్ధ విమానం..
  • హైలెవల్ ఎంక్వైరీకి ఆదేశించిన ఎయిర్ ఫోర్స్
5 Soldiers Martyred

5 Soldiers Martyred

IAF Plane Crash: భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఆంటోనోవ్ ఏఎన్-32 (An-32) రవాణా విమానం అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ బేస్ సమీపంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో దేశ సేవలో ఉన్న ఐదుగురు ధైర్యవంతులైన వైమానిక దళ సిబ్బంది వీరమరణం పొందారు. ఈ ప్రమాదంలో విమానం యొక్క కో-పైలట్ ఒక్కరు మాత్రమే తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆ ఐదుగురు వీర సైనికుల వివరాలు ఇవే..

స్క్వాడ్రన్ లీడర్ (Sqn Ldr) ప్రశాంత్ సింగ్

×
×
Ad

ఫ్లైట్ లెఫ్టినెంట్ (Flt Lt) శుభం కుమార్

సార్జెంట్ (Sgt) జితేంద్ర శర్మ

అగ్నివీర్వాయు ఖేమరం కుమావత్

అగ్నివీర్వాయు డానిష్ ఆలం

ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం

ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, భారత వైమానిక దళం తక్షణమే స్పందించింది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఒక ‘కోర్టు ఆఫ్ ఎంక్వైరి’ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ విచారణలో పరిగణనలోకి తీసుకోనున్న కీలక అంశాలు ఏంటంటే.. విమానంలో సాంకేతిక లోపాలు ఏమైనా తలెత్తాయా?, ఇంజిన్ వైఫల్యం ఏమైనా జరిగిందా, లేదా ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేవి కీలకం కానున్నాయి. ప్రమాద సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న వారిలో కో-పైలట్ మాత్రమే ప్రాణాలతో బయటపడటంతో, ప్రమాదం జరిగిన తీరును అర్థం చేసుకోవడానికి ఆయన ఇచ్చే వాంగ్మూలం (Statement) ఈ విచారణలో అత్యంత కీలకం కానుందని చెబుతున్నారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం అధికారికంగా స్పందిస్తూ, “ఈ విషాదకర ఘటనలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు భారత వాయుసేన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. ఈ కష్టకాలంలో అమరవీరుల కుటుంబాలకు వాయుసేన అండగా నిలుస్తుంది” అని పేర్కొంది. దేశ రక్షణలో అహర్నిశలు శ్రమించే వీర జవాన్ల మరణం దేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. వైమానిక దళం చేపట్టిన విచారణలో త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.