NTV Telugu Site icon

PM Modi: “కాంగ్రెస్‌ 40 సీట్లు దాటదు”.. రాజ్యసభలో పీఎం మోడీ విమర్శలు..

Modi 2

Modi 2

PM Modi: పార్లమెంట్ ఎన్నికల ముందు చివరిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. బుధవారం రాజ్యసభలో మరోసారి ఫైర్ అయ్యారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 40 సీట్లు దాటదని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాతబడిందని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ 40(2024 లోక్‌సభ ఎన్నికల్లో) సీట్లు దాటదని పశ్చిమ బెంగాల్ నుంచి సవాల్ విసిరారు’’ అని ఇటీవల సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని గుర్తు చేశారు. ‘‘మీరు 40 సీట్లు సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు.

Read Also: Bandi Sanjay: ఈటలకి నాకు ఎలాంటి కోల్డ్ వార్ లేదు.. క్లారిటీ ఇచ్చిన బండిసంజయ్

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని ఉద్దేశిస్తూ..ఖర్గేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని, ఖర్గే సభలో సుదీర్ఘంగా మాట్లాడినందుకు తాను సంతోషిస్తున్నానని, అయితే, ఆయన తన కమాండర్లు ఇద్దరు సభలో లేకపోవడం వల్లే స్వేచ్ఛగా మాట్లాడారని, ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. 2014లో 72 సీట్లు, 2019లో 44 సీట్లకే పరిమితమైంది. ఇటీవల ఇండియా కూటమిలో భాగమైన మమతా బెనర్జీ కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 40 స్థానాల్లో అయినా గెలుస్తుందా..? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.