Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News I Love Muhammad Row Bareilly Clashes Police Lathicharge Up

UP: ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం.. యూపీలో అల్లర్లు..

Published Date :September 26, 2025 , 6:02 pm
By Venu Goapl Reddy
  • ఉద్రిక్తల్ని పెంచుతున్న ‘ ఐ లవ్ ముహమ్మద్’ వివాదం..
  • బరేలీలో రాళ్ల దాడి, లాఠీచార్జ్ చేసిన పోలీసులు..
UP: ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం..  యూపీలో అల్లర్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

UP: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ పోస్టర్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం బరేలీలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 4న ‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్‌తో ఉన్న టెంట్‌ను పోలీసులు తొలగించిన తర్వాత కాన్పూర్‌లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఒక మతపెద్ద మెమోరాండం సమర్పించాలని ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా శుక్రవారం ప్రార్థనల తర్వాత బరేలీలోని ఇస్లామియా మైదానం సమీపంలో భారీగా జనాలు గుమిగూడారు.

ఈ సమయంలో గుంపులో కొంత మంది అసభ్యకరమైన నినాదాలు చేయడంతో పాటు కొంత మంది నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అధికారులు ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లకు సంబంధించి కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.

Read Also: Acerpure Nitro Gaming TV: బడ్జెట్ ధరలో.. ఏసర్ నుంచి అధునాతన ఫీచర్లతో గేమింగ్ స్మార్ట్‌ టీవీ విడుదల..

గొడవ ఎలా మొదలైంది..?

సెప్టెంబర్ 4న కాన్పూర్‌లో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా ‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్‌‌ను ఒక టెంట్‌పై ఉంచారు. స్థానిక హిందూ సంఘాలు బోర్డును వ్యతిరేకించాయి. హిందూ,ముస్లిం జనాభా ఉండే ప్రాంతాల్లో, రామనవమి వంటి హిందూ పండగలు జరిగే ప్రాంతంలో దీనిని ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసినట్లు వాదించారు. దీంతో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. కాన్పూర్ పోలీసులు సెప్టెంబర్ 09న టెంట్‌ని తొలగించారు. దీనిని ఏర్పాటు చేసిన 24 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముస్లింలపై కేసులు నమోదు చేయడం వివక్ష అంటూ పలువురు మతపెద్దలు ఈ వారం పోలీసులపై ఆరోపణలు చేశారు.

గురువారం మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు అనేక దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేశారు. గుజరాత్ గాంధీనగర్ జిల్లాలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మంగళవారం రాత్రి కర్ణాటక దావణగెరెలో ‘ఐ లవ్ ముహమ్మద్’’ పోస్టర్లు వెలిశాయి. ఇది ఇరు వర్గాల రాళ్ల దాడికి కారణమైంది. యూపీలోని ఉన్నావ్, మహారాజ్‌గంజ్, లక్నో, కౌశాంబిలో కూడా అశాంతి చెలరేగింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bareilly clashes
  • communal clashes
  • Eid-e-Milad row
  • I Love Mahadev campaign
  • I Love Muhammad row

తాజావార్తలు

  • Telangana : గుడ్ న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షలు..!

  • SCR Railway: రైల్వే ప్రయాణికుల బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్ డెస్టినేషన్ స్టేషన్ మార్పు..

  • Price Hike : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న మందులు, పెయింట్ల ధరలు

  • Mrunal Thakur: లవ్‌ లైఫ్‌పై ఓపెన్‌ అయిన మృణాల్‌ ఠాకూర్‌.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!

  • Aasman : శ్రీహరి కొడుకు హీరోగా ‘ఆస్మాన్’ మూవీ ప్రారంభం

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions