NTV Telugu Site icon

Western Railway TC: మహారాష్ట్రీయులు లేదా ముస్లిం వ్యాపారాలకు మద్దతు ఇవ్వను..

Mumbai

Mumbai

Western Railway TC: వెస్ట్రన్ రైల్వేలో పని చేస్తున్న టిక్కెట్ కలెక్టర్ (TC) ఆశిష్ పాండే మరాఠీ లేదా ముస్లిం వర్గాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ముంబైలో తీవ్ర వివాదం కొనసాగుతుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతడు ముంబైలోని విక్రోలిలో నివసిస్తున్నాడు. తాను మరాఠీ లేదా ముస్లిం డ్రైవర్లు నడిపే ఆటో-రిక్షాలను ఉపయోగించనని ప్రకటించాడు. ఈ ఆడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర దుమారం కొనసాగుతుంది. ఇది పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే దాదాపు 1,000 రీపోస్ట్‌లతో పాటు 1. 30 వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు.

Read Also: Jani Mastar case : కొన్ని ఛానెల్స్ అత్యుత్సాహంతో బన్నీపేరు పెట్టాయి: పుష్ప నిర్మాత

కాగా, ఆశిష్ పాండే వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక హక్కులపై బలమైన వైఖరికి పేరుగాంచిన రాజకీయ పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) వెంటనే రియాక్ట్ అయింది. వెస్ట్రన్ రైల్వే టీసీ ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంఘాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఎంఎన్ఎస్ పార్టీ పేర్కొనింది. ఈ సంఘటనతో మహారాష్ట్ర స్థానిక జనాభా పట్ల వలసదారుల వైఖరి ఏంటో స్పష్టం అవుతుందన్నారు.

Read Also: Nitin Gadkari: సహచర మంత్రిని టీజ్ చేసిన నితిన్ గడ్కరీ

కాగా, దీనిపై స్పందించిన వెస్ట్రన్ రైల్వే.. ఒక ప్రకటన జారీ చేసింది. మేము ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాం.. మతపరమైన సంఘాలు, మహారాష్ట్రీయుల గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. ఈ అంశంపై విచారణ కొనసాగుతుంది.. వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని వెస్ట్రన్ రైల్వే ప్రతినిధి తెలిపారు.