Budget 2025: కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై హైదరాబాద్ నగరం భారీగా ఆశలు పెట్టుకుంది. మౌలిక వసతులు, ఇతర రంగాలకు ప్రాధాన్యం ఉంటుందని, నిధుల కేటాయింపులు ఉంటాయని మహా నగర ప్రజలు వేచి చూస్తున్నారు. బల్దియాలో ఎంఎంటీఎస్ కొత్త రైళ్లతో పాటు చర్లపల్లి టెర్మినల్ నుంచి పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ, పుణ్య క్షేత్రాలకు మరిన్ని ట్రైన్స్ ను అందుబాటులోకి తెవాలని ఆశిస్తున్నారు. అలాగే, మూసీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కోరింది. విశ్వ నగరంగాగా హైదరబాద్ విస్తరిస్తుండటంతో ఐటీ రంగానికి మరింత బూస్ట్ ఇచ్చేలా మోడీ సర్కార్ కరుణించనుందా..?
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అయితే, ఈ కేంద్ర బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి ఎంత మేర కేటాయింపులు చేస్తారనేది ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది. నగరంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న బల్దియా పలు కార్యక్రమాలకు బడ్జెట్ పై భారీగానే ఆశలు పెట్టుకుంది. గృహ నిర్మాణానికి పీఎంఏవై నిధులతో పాటు ఫ్లై ఓవర్లు, రహదారుల డెవలప్మెంట్, వరద సమస్యల పరిష్కారం, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం వంటి వాటి కోసం రూ. 10 వేల కోట్లకు పైగా కేంద్రాన్ని సాయం కోరింది. వరద ముంపు సమస్యల పరిష్కారంతో పాటు చెత్త సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు కేటాయించాలని పేర్కొనింది. హైదరాబాద్ వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు పురాతన కట్టడాల అభివృద్ధికి నిధులను ఇవ్వాలని కోరింది. జీహెచ్ఎంసీ అడిగినదాంట్లో ఎన్నింటికి కేంద్రం నిధులు ఇస్తారో వేచి చూద్దాం.