భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఎన్నో కారణాల వలన భార్యాభర్తలు విడిపోతారు.. భార్య మాట వినడం లేదని, భర్త తాగుతున్నాడని, కొడుతున్నాడని,వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడని.. ఇలా రకరకాల కారణాలు మనం చాలానే విని ఉంటాం.. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక జంట మధ్య గొడవకు కారణం.. మటన్.. ఏంటీ మటనా..? అంటే .. అవును మటన్ వలనే ఆ ఇద్దరికీ చెడింది. భార్య, భర్త ఓ మటన్ కర్రీ లవ్ స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ఢిల్లీకి చెందిన వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఎంతో అందమైన మహిళతో వివాహమైంది. కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు రేగాయి. దానికి కారణం భార్య వేరొకరి ప్రేమలో పడడమే.. ఆమె ప్రేమలో పడింది మటన్ కర్రీతో.. విషయం ఏంటంటే శిరీష్ ఫ్యామిలీ శాఖాహారులు.. ఆమె భార్య ఫ్యామిలీ కూడా వెజిటేరియన్సే.. కానీ, సదురు మహిళ చదువుకునే రోజుల్లో ఒక్కసారి మటన్ రుచి చూసి దానికి ఫిదా అయిపోయింది. ఇంట్లో తెలియకుండా బయట మటన్ తినేది. పెళ్లి చూపుల్లో కూడా అతడికి, ఆమె ఇదే విషయం చెప్పింది. అయితే అప్పుడు అతను ఇకనుంచి మతం మానేయాలి అని షరతు పెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు… కానీ ఆమె మాత్రం భర్త మాటను పక్కకు నెట్టి మటన్ తినడం ప్రారంభించింది. ఈ విషయం భర్తకు తెలిసి ఆమెపై గొడవకు దిగి.. చివరకు ” నీకు మొగుడు కావాలో.. మటన్ కావాలో .. తేల్చుకో” అని కొద్దిరోజులు టైం ఇచ్చాడు.
టైం అయితే ఇచ్చాడు కానీ అతడి మనసులో అనుమానం మొదలయ్యింది. ఆమె తనను కాదని మటన్ కావాలని అంటే ఏంటి పరిస్థితి అని.. దీంతో అతని బాధను మొత్తం పేపర్ పై పెట్టి ఓ ఫ్యామిలీ కౌన్సిలర్‌కి లెటర్ రాశాడు. ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై కౌన్సిలర్ తనదైన శైలిలో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.” డియర్ ప్యూర్ వెజ్ .. మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రపంచ రికార్డు సృష్టించనుంది.. ఒక మనిషి, మేకలలో ఎవరు కావాలని ఒక అమ్మాయిని అడిగితే .. నా అభిప్రాయం ప్రకారం ఆమె మేకనే ఎన్నుకొంటుంది.. ఎందుకంటె ప్రేమించిన వాడు లేకపోయినా ఉండొచ్చు కానీ, తిండి లేకపోతె ఉండలేరు కదా.. ఇప్పుడు నీ భార్య ఎవరిని ఎంచుకొంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ న్యూస్ ఆర్టికల్ పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
