Site icon NTV Telugu

biryani Fighting: బిర్యానీ విషయంలో గొడవ.. భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

Biryani

Biryani

భార్యాభర్తల మధ్య అనేక విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి.. కొన్నిసార్లు చిన్న విషయాలకే పెద్ద ఘర్షణ జరిగిన సందర్భాలు ఉంటాయి.. ఎవరో ఒక్కరూ కూల్‌ అయితే గానీ.. అవి అక్కడితో ఆగవు.. ఎవరు క్షణికావేషానికి లోనైనా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.. ప్రాణాలు కూడా తీసుకున్న సందర్భాలు ఎన్నో.. అయితే, తాజాగా చెన్నైలో బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య వివాదం మొదలైంది.. దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టాడు.. ఆ మంటలను తట్టుకోలేని మహిళ.. నేరుగా వెళ్లి భర్తను కౌగిలించుకోవడంతో.. ఇద్దరికీ మంటలు వ్యాపించాయి.. ప్రస్తుతం ఇద్దరూ ప్రాణాలతో ఆస్పత్రిలొ కొట్టుమిట్టాడుతున్నారు.

Read Also: Students Missing: తిరుపతిలో కలకలం.. ఐదుగురు టెన్త్‌ విద్యార్థుల కిడ్నాప్..!

చెన్నై అయనవరం ఠాగూర్ నగర్‌లో జరిగిన ఈ బిర్యానీకి గొడవకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరుణాకరన్ (75) అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, అతని భార్య పద్మావతి (66)తో కలిసి ఠాగూర్‌ నగర్‌లో నివాసం ఉంటున్నాడు.. అయితే, గత రాత్రి ఇంటికి బిర్యానీ తెచ్చుకున్న కరుణాకరన్.. భార్యకు ఇవ్వకుండా తానే తినేశాడు.. కానీ, నాకెందుకు బిర్యానీ తీసుకురాలేదంటూ కరుణాకరన్ ప్రశ్నించింది భార్య పద్మావతి.. ఇక్కడే వివాదం మొదలైంది.. ఒక్కరోజు అయినా వంట బాగా చేశావా? అంటూ భార్యకు గొడవకు దిగాడు.. మాటామాట పెరిగింది.. ఆగ్రహంతో ఊగిపోయిన కరుణాకరన్‌.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఆ మంటల్లో చిక్కుకుని అరుస్తూ.. భర్తను కౌగిలించుకుంది పద్మావతి.. ఓవైపు పొగలు.. మరోవైపు.. వృద్ధ దంపతుల అరుపులు విన్న స్థానికులు.. ఆ తర్వాత మంటలార్పి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందనే.. ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు.. మొత్తంగా బిర్యానీ విషయంలో తలెత్తిన వివాదం.. దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది.

Exit mobile version