వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 4 లక్షలకు పైగా మెజార్టీతో ఆమె గెలుపొందారు. తాజాగా ప్రియాంక విక్టరీపై భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో వినిపించేందుకు ప్రియాంక శ్రమిస్తుందని తెలిపారు. ఇప్పటిదాకా ప్రియాంక పుస్తకాలు చదవడం, పిల్లల్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారని.. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ఆమె ఎన్నికల బరిలోకి దిగారని తెలిపారు. అలాగే తాను కూడా ప్రజల కోసం శ్రమిస్తూనే ఉంటానన్నారు. అలాంటప్పుడు పార్లమెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అయినా నాకూ అలాంటి సమయం వస్తుందని.. ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుందని వాద్రా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన ఎన్డీఏ..
మహారాష్ట్ర ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రజల తీర్పును గౌరవించాలని.. గెలిచిన పార్టీతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఇక జార్ఖండ్ ఫలితాలపై సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి అధికార పార్టీకి బీజేపీ ఇబ్బందులు కలిగించిందని ఆరోపించారు. అయినా ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని రాబర్ట్ వాద్రా అన్నారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి భారీ విజయం సాధించింది. ఇక మహారాష్ట్రలో మహాయుతి కూటమి(ఎన్డీఏ) గెలుపొందింది.
ఇది కూడా చదవండి: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో టీమిండియా
ప్రియాంక వయనాడ్ లోక్‌సభ బైపోల్స్‌లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ విక్టరీ అందుకున్నారు. తన సోదరుడు రాహుల్‌గాంధీ మీద ఉన్న 3.64 లక్షల మెజార్టీని దాటుకుంటూ 4 లక్షల మెజార్టీని క్రాస్ చేసి అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నారు. 4,08,036 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.